క్యాన్సర్ ఆస్పత్రిని జాతికి అంకితం చేసిన ప్రధాని
== అసోం అభివృద్దికి కట్టుబడి ఉన్నాం
== శాంతిస్థాపన లక్ష్యంగా బిజెపి కృషి
== బహిరంగసభలో ప్రధాని మోడీ హామి
(గౌహతి-విజయంన్యూస్);-
అసోం పర్యనటలో భాగంగా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోంలో పర్యటనలో భాగంగా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా దిఫులో శాంతి ఐక్యత, అభివృద్ధి పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్య, విద్యా రంగానికి సంబంధించిన వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజీ తదితర ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. అభివృద్ధి, నమ్మకమే తమ విధానమన్న ఆయన.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామన్నారు.
also read :-నల్లగొండకు సిఎం వరాల జల్లు
అసోంలోని 23 జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని
తొలగించామని మోడీ చెప్పారు. ఈశాన్యంలో శాంతి భద్రతలు మెరుగుపడినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అసోం మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులను ప్రోత్సహించేలా ఉందని అభిప్రాయపడ్డారు. అసోం మెడికల్ కాలేజీ దిబ్రూఘర్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ క్యాన్సర్ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. డిబ్రూఘర్ లోని ఖనికర్ మైదానంలో మరో ఏడు క్యాన్సర్ ఆస్పత్రులకు రతన్ టాటాతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు క్యాన్సర్ ఆస్పత్రులను ప్రారంభించిన మోడీ.. మరో ఏడు క్యాన్సర్ ఆస్పత్రులకు భూమి పూజ చేశారు.
also read :-ఖమ్మం నగరంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణి
2020లో బోడో ఒప్పందం శాశ్వత శాంతికి తలుపులు తెరిచాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోంలో పర్యటిస్తున్న మోడీ.. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డిఫు వద్ద శాంతి ఐక్యత, అభివృద్ధి ర్యాలీలో పాల్గొన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ స్ఫూర్తితో సరిహద్దు సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నామన్నారు. అసోం, మేఘాలయ మధ్య జరిగిన ఒప్పందం ఇతర రాష్టాల్రను కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఈశాన్య రాష్టాల్ర నుంచి ప్రత్యేక అధికారాలు తొలగించామన్నారు. అక్కడ శాంతిభద్రతలు మెరుగైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.