2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం : పవన్ కల్యాణ్
** ద్వేషించడం రాజకీయాం కాదు
** రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషానికి తావు లేదు
** ప్రశ్నించడం జనసేన సిద్దాంతంగా మలచుకున్నాం
** ఒక్క చాన్స్ పేరుతో ప్రజలను నిండా ముంచారు
** ఎప్పటికీ అమరావతియే రాజధాని
** ఇప్పటం గ్రామానికి 50 లక్షల విరాళం
** జనసేన ఆవిర్భావ సభలో ఆవేశంగా మాట్లాడిన పవన్ కల్యాణ్
(అమరావతి-విజయంన్యూస్)
2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వాగ్దానలను నెరవేర్చడంలో వైసిసి విఫలం అయ్యిందన్నారు. ప్రజలను వంచించారని అన్నారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయాల్లో విభేదాలుండొచ్చని.. వ్యక్తిగత ద్వేషాలొద్దన్నారు. వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారమని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీలో బూతులు తిట్టే వారితో పాటు మంచి నేతలూ ఉన్నారని చెప్పారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉండాలా అని ప్రశ్నించారు. పార్టీ నడపడానికి కావాల్సింది సిద్దాంతమని, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుందని పవన్ పేర్కొన్నారు. నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలని, ప్రశ్నించడమంటే మార్పునకు శ్రీకారమని పవన్ చెప్పారు. వైసీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదు. వైసీపీ కార్యకర్తల్ని ఆలోచించాలి.
also read;-రాఘవపై కుట్రలు పన్నారు : వనమా వెంకటేశ్వరరావు
ఒక్క ఛాన్సని ఏపీని జగన్ నిండా ముంచేశాడు. 32 మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసింది వైసీపీయే. మూడు రాజధానుల మాట ఆ రోజెందుకు చెప్పలేదు?. మద్దతిచ్చిన టీడీపీని కూడా ప్రశ్నించింది జనసేనే. ఏపీ రాజధాని ముమ్మాటికీ అమరావతేనని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆవేపూరిత ప్రసంగం చేశారు. పవన్ ప్రసంగించే ముందు జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ అని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆరంభంలోనే సర్వమతాలను జనసేనాని ప్రస్తావించారు. ఏపీ, తెలంగాణ నుంచి ఆవిర్భావ సభకు తరలివచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహించేందుకు అనుమతిచ్చిన ఇప్పటం రైతులకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామపంచాయతీకి రూ.50 లక్షలు ఆయన ప్రకటించారు. జనసైనికులు కొదమ సింహాలై గర్జించాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు అండగా ఉండాలనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విభేదాలుండొచ్చు.. వ్యక్తిగత ధ్వేషాలొద్దని పవన్ సూచించారు.
also read;-9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం : మంత్రి హారీష్ రావు
ప్రశ్నించడం ద్వారానే సమసమాజాన్ని ఆవిష్కరించే వీలున్నదని, తొలి ఆవిర్భావ సభలో కూడా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించామని, కార్యకర్తలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తనపై ఉన్న అభిమానాన్ని దేశంవైపు, సమాజం వైపు మళ్లించి సేవ చేయండి అని పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్యను ఎవరు మరిచినా తాము మరవమని, ఆయన స్ఫూర్తిని గుండెల్లో పెట్టుకుని ముందుకు నడుస్తామన్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ శివారులో జనసేన 9 వ ఆవర్భావ బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఒప్పుకున్నారని, రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవని చురకలంటించారు. సీఎంలు మారినప్పుడల్లా పాలసీలు మారవని వ్యాఖ్యానించారు.
also read;-మరో మైలురాయిని అధిగమించిన అశ్విన్
మూడు రాజధానులుఅంటూ ఇప్పుడు చెప్తున్న నేతలు అప్పుడు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. ఎవరెన్ని మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చెప్పారు. రాజకీయాల్లో మాటామాటా అనుకోవడం సహజమని, అయితే, తెలంగాణలో మాదిరిగా అలయ్ బలాయ్‌లో వైషమ్యాలు మరిచి శత్రువులను కూడా దగ్గరికి తీసుకున్నట్లుగా రాజకీయాలు ఉండాలని పవన్ కల్యాణ్ అభిలాషించారు. రాజకీయాల్లో విబేధాలు ఉంటాయి, కానీ వ్యక్తిగత ద్వేషాలు ఉండొద్దని నమ్మే వ్యక్తినని చెప్పారు. పార్టీ నడపాలంటే వేల కోట్ల రూపాయలు ఉండటం కంటే సైద్దాంతికంగా పనిచేసే కార్యకర్తలే అవసరమన్నారు. కేవలం 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రారంభమై జనసేన ఇవాళ 3 లక్షల సభ్యులు ఉండే స్థాయికి చేరుకున్నదని చెప్పారు. 2019 లో గెలిచిన జనసేన ఎమ్మెల్యేను వైసీపీలో కలిపేసుకున్నారని చెప్పిన పవన్ కల్యాణ్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 7.24 శాతం ఓట్లను, స్థానిక సంస్థల ఎన్నికల్లో 27.4 శాతం ఓట్లు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎన్నో పదవులను కైవసం చేసుకున్నామని వెల్లడిరచారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం 27.28 శాతం ఓట్లు సాధించామని, మహావృక్షం చిన్న విత్తనంతో ఎదిగినట్లుగా మనం కూడా ఎదుగుదామని పిలుపునిచ్చారు. అపజయం ఎదురైనా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడటం కేవలం జనసేన నేతలకే చెల్లిందన్నారు.
ఈ రాష్ట్రం బాగుండాలనేది జనసేన కార్యకర్తల చేతుల్లోనే ఉన్నదని, విూ పోరాట పటిమపైనే ఆధారపడి ఉన్నదన్నారు. ఆ దారిలో నేను నడిచి చూపుతా.. విూరూ ఆ దారిలో నడవండని పిలుపునిచ్చారు. ఏడు శాతం ఓట్ల నుంచి ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి జనసేన ఎదుగుతుండటం శుభపరిణామన్నారు.ఆవిర్భావ సభ వేదికపై నుంచి జనసేన పార్టీ యాప్‌ను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. దీని ద్వారా పార్టీ సభ్యత్వం చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జనసేన 9 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహిరంగసభ జరుపుకునేందుకు అవకాశం కల్పించిన ఇప్పటం గ్రామానికి కృతజ్ఞతగా తన వ్యక్తిగత ట్రస్ట్ తరపున రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
also read;-వందకోట్ల క్లబ్‌లో చేరిన గంగూబాయి
నాగబాబు కారణంగానే తాను అంతో ఇంతో రాజకీయాలు మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. నెల్లూరులో లా చదువుతున్న రోజుల్లో ఆయన నాకు ఇచ్చిన నానీ పాల్కీవాలా రాసిన ’వీ ద పీపుల్, వీ ద నేషన్’ పుస్తకం నాకు బైబిల్‌గా మారిందన్నారు. తొమ్మిదేళ్ల కింద జనసేన పార్టీ ఆవిర్భవించింది. 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ`బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ కేవ లం ఒక్క స్థానంలో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అది కూడా ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని యోచిస్తోంది. పార్టీ నడపడానికి కావాల్సింది సిద్దాంతమని చెప్పారు.
ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుందని పేర్కొన్నారు. నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలన్నారు. నాయకుడికి ఉండాల్సింది పట్టు, విడుపు అని తెలిపారు. ప్రశ్నించడమంటే మార్పునకు శ్రీకారమని వ్యాఖ్యానించారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలుగు కావాలంటే అధికారంలోకి పవన్ రావాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లాలోని ఇప్పటంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఏపీని జగన్ అంధకారంలోకి నెట్టారని ఆయన ఆరోపించారు. నిజాయితీగా పనిచేస్తే ప్రజలు మరచిపోరన్నారు. వైసీపే నేతలు దోపిడీలు, భూ కబ్జాలకు పాల్పడు తున్నారని ఆరోపించారు. ఇప్పటం గ్రామంలో జనసేనకు
రైతులకు అండగా ఉన్నారన్నారు. దొంగలు రెండు రకాలుగా ఉంటారని జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. జిల్లాలోని ఇప్పటంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లడారు.
రాజకీయ దొంగలను మనమే ఎన్నుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని లేకుండా జగన్ మూడేళ్లపాటు పాలించారని ఆయన అన్నారు. జగన్ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. నా అనుభవంలో మంచి, చెడ్డ సీఎంను చూశానని, కానీ దుర్మార్గ సీఎం జగన్‌రెడ్డేనని ఆయన విమర్శించారు. మరోసారి జగన్ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా ఇతరరాష్టాల్రకు పోవాలని ఆయన అన్నారు. జగన్ సీఎం అయ్యాకే ఏపీకి అప్పులు, కష్టాలు మొదలయ్యాయన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.