పంజాబ్‌లో ఓడిన సోనూసూద్ సోదరి
(చండీఘడ్-విజయంన్యూస్);-
ఆయన మానవత్వానికే నిలువుటద్దం.. కరోనా సమయంలో ప్రజలకు సహాయాన్ని అందించి దేశ ప్రజల మనసులను కొల్గగొట్టిన ఆ నటుడు ఎందరికో ఆదర్శమైయ్యాడు.. ఆయనలా అందరు ఉండాలని యువత కోరుకున్నారు.. అలాంటి వ్యక్తికి పంజాబ్ ప్రజలు చేయూతనందించలేకపోయారు. ఆయనే సినినటుడు సోనూసూద్. దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సోనూసూద్ సోదరి పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాళవిక సూద్ పోటీ చేసి ఓటమి చవిచూసింది.
also read;-పంజాబ్ లో కాంగ్రెస్ అందుకే ఓడిందా..?
తన ప్రత్యర్థి అభ్యర్థి కంటే మాళవిక ఓడిపోయారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ సోదరే ఓటమి చెందడం విశేషం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోగా పట్టణంలోని తన నివాసంలో కాంగ్రెస్ అధినేత నవజోత్ సింగ్ సిద్దూ, సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనుసూద్ సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పంజాబ్ ఎన్నికల కమిషన్ తన ప్రచారకర్తగా సోనుసూద్ నియమకాన్ని ఉపసంహరించుకుంది.