Telugu News

పంజాబ్‌ ఆప్‌ సిఎం అభ్యర్థిగా మాన్‌

వెల్లడిరచిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌

0

పంజాబ్‌ ఆప్‌ సిఎం అభ్యర్థిగా మాన్‌
== వెల్లడిరచిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌
(న్యూఢల్లీ- విజయంన్యూస్)
ఢిల్లీ లో వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ పంజాబ్ లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తోంది.. దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్న ఆప్ నేత ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆయన కన్ను పంజాబ్ రాష్ట్రంపై పడింది. పంజాబ్ రాష్ట్రంలో రైతాంగం బీజేపీ పై వ్యతిరేకంగా ఉండటం, కాంగ్రెస్ లో వర్గపోరు ఫలితంగా సందులో సడేమియా లా ఆప్ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు ఆప్ నేత సీఎం కేజ్రివాల్. అంతే కాదు ఏకంగా పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించి సంచలనం రేపారు.

also read;-తమిళనాడు గవర్నర్‌ను కలిసిన చిన్నజీయర్‌ స్వామి

పంజాబ్‌ ఆప్‌ సిఎం అభ్యర్థిగా మాన్‌ అంటూ ఢిల్ సీఎం కేజ్రివాల్ ప్రకటన చేశారు. ఆయన కేజ్రీవాల్‌ కోరుకున్నట్లుగానే ప్రజలు కూడా ఆయన అభ్యర్థిత్వానికే మద్దతు పలికారు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌ మాన్‌ అని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ మంగళవారం విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ప్రజాభిప్రాయాన్ని బట్టి ఆయనను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఫోన్‌, వాట్సాప్‌ ద్వారా తెలియజేశారని, భగవంత్‌ మాన్‌కు 93.3 శాతం మంది మద్దతు పలికారని చెప్పారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూను ముఖ్యమంత్రిగా చూడాలని 3 శాతం మంది కోరుకున్నట్లు తెలిపారు.

also read;-బాటసింగారం వద్ద టిప్పర్‌ బీభత్సం

పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ గెలుస్తుందని స్పష్టమైపోయిందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనవారే తదుపరి పంజాబ్‌ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. భగవంత్‌ మాన్‌ 2014 మార్చిలో ఆప్‌లో చేరారు. 2014, 2019లలో సంగ్రూర్‌ నియోజక వర్గం నుంచి ఆప్‌ లోక్‌సభ సభ్యునిగా గెలిచారు. ప్రస్తుతం పంజాబ్‌ ఆప్‌ కన్వీనర్‌గా ఉన్నారు. 2011లో పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2012లో లెహ్రా నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. వృత్తి రీత్యా ఆయన నటుడు, కమెడియన్‌.