Telugu News

తలపై నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వీడియో 

0

తలపై నీళ్లు పోసుకున్న రాహుల్ గాంధీ

== ఎన్నికల ప్రచారంలో హీటెక్కిన తల

== సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న వీడియో 

(న్యూఢిల్లీ -విజయం న్యూస్)

అసలే పార్లమెంట్ ఎన్నికలు.. ఒక వైపు నరేంద్రమోడీ.. మరో వైపు ఎన్డీఏ కూటమి దూకుడు.. ఇంకో వైపు ఇండియా కూటమిలో అలకలు.. ఇవ్వని ఒక ఎత్తు అయితే చిర్రాడించేస్తున్న సూర్యుడు..ఇంకేముంది.. రాహుల్ తల హీటేక్కడం జరగదా..? అదే జరిగింది..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపై నీళ్లు పోసుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం ఉత్తరప్రదేశ్ రుద్రపూర్ బహిరంగ సభలో ఆయన బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగారు. ఆ కాసేపటికే ‘చాలా వేడిగా ఉంది’ అంటూ తలపై నీళ్లు పోసుకున్నారు. కాగా, యూపీలో నిన్న రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 

రాహుల్ గాంధీ తలపై నీళ్ళు పోసుకునే వీడియో..దిగువునా..