ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.
(ఏన్కూర్ విజయం న్యూస్): –
ఏన్కూర్ లో శనివారం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్లో రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
also read :-అభివృద్ధికి తెలంగాణ రోల్ మోడల్….
అనంతరం పండ్లు పంచిపెట్టారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు, బండ్ల విజయకుమారి, వేముల కృష్ణప్రసాద్, ఆనంద ప్రసాద్, మాలోతు నరసింహారావు,వాసిరెడ్డి సత్యనారాయణ, గుర్రం రవి, తాళ్లూరి నరసింహారావు, సాయి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.