Telugu News

రేషన్ షాపుల్లో ఇకనుండి ఆ సేవలు కూడా

విజయం న్యూస్

0

రేషన్ షాపుల్లో ఇకనుండి ఆ సేవలు కూడా

(విజయం న్యూస్):-

దేశంలో రేషన్ సరుకులను అందించే దుకాణాలు ఇక నుంచి ఆర్థిక సేవలను కూడా అందించబోతున్నాయి. బిజినెస్ కరెస్పాడెంట్ల మాదిరిగా వ్యవహరించనున్నాయి. ముద్రా లోన్లను జారీ చేయించేందుకు సాయపడనున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు, ఆర్థిక చేరికకు కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణదారులకు ఈ సర్వీసులు అందజేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సరసమైన ధరల దుకాణాలు(ఎఫ్‌పీఎస్‌లు) ఆర్థిక సేవలను అందజేస్తూ అదనంగా ఆదాయాన్ని పొందనున్నారు.

also read ;-****ఉల్లాసంగా…! ఉత్సాహంగా…పొంగులేటి పర్యటన

ప్రస్తుతం 3 లక్షలకు పైగా కామన్ సర్వీసు సెంటర్లు(సీఎస్‌సీలు) ప్రజలకు పలు ఆర్థిక సేవలను అందజేస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డు రిజిస్ట్రేషన్స్, రైల్వే టిక్కెట్ల బుకింగ్, మ్యూజిక్ డౌన్‌లోడ్స్, బ్యాంకు బ్యాలెన్స్‌ల చెకింగ్, ఆదాయపు పన్ను సేవలు, పలు ప్రభుత్వ స్కీమ్‌ల సమాచారాన్ని అందజేస్తున్నాయి.

ఎలక్ట్రానిక్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(మైటీ) డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌ కింద, వచ్చే రెండేళ్లలో సీఎస్‌సీల సంఖ్యను ఆరు లక్షల గ్రామాలకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 8 వేల సీఎస్‌సీలు ఎఫ్‌పీఎస్‌లతో అనుసంధానమై ఉన్నాయి. వచ్చే ఏడాదిలో మరో 10 వేల సెంటర్లను ఎఫ్‌పీఎస్ అవుట్‌లెట్లతో అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మారుమూల ప్రాంతాలకు కూడా ఆర్థిక సేవలు చేరుకునేలా చేస్తోంది.

ప్రస్తుతం 5.34 లక్షల ఎఫ్‌పీఎస్‌లు దేశంలో 60 నుంచి 70 మిలియన్ టన్నుల సబ్సిడీ ఆహార ధాన్యాలను 80 కోట్ల మందికిపైగా లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నాయి. ఈ అవుట్‌లెట్లకు ఎక్కువ మంది ప్రజలు రావడం ద్వారా ఎఫ్‌పీఎస్‌ల నుంచి ఆదాయాన్ని కూడా జనరేట్ చేయొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.