Telugu News

నూతన ఎస్ఐగా రవి నాయక్ బాధ్యత స్వీకరణ!

మహబూబాబాద్-చిన్నగూడూరు విజయం న్యూస్

0

నూతన ఎస్ఐగా రవి నాయక్ బాధ్యత స్వీకరణ!

(మహబూబాబాద్-చిన్నగూడూరు విజయం న్యూస్);-

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా రవి నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించే విజయ్ రామ్ కుమార్ బదిలీపై వెళ్లగా గార్ల ఎస్ ఐ గా ఉన్న తను చిన్న గూడూరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యతలు నిర్వహిస్తానని ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

also read :-ఈనెల 27 న మేడారం లో ఆదివాసి మహిళ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికను విజయ వంతం చేయాలి

ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ కి (టీ ఏ జె ఫ్ ) నాయకులు మహబూబాబాద్ జిల్లా తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు మాచర్ల ఉపేందర్,ప్రధాన కార్యదర్శి నాగన్న, చిన్న గూడూరు మండల (టీ ఏ జె ఫ్ )అధ్యక్షుడు బోయినినరేందర్,ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్, సభ్యులు గాడిపల్లి సందీప్,గాడిపల్లి శ్రీను, బుల్లి కొండ సైదులు శాలువాతో సన్మానించడం జరిగింది.