Telugu News

గుజరాత్‌లో రికార్డులే రికార్డులు

సోలంకి రికార్డును దాటిని బిజెపి

0

గుజరాత్‌లో 27 ఏళ్ల రికార్డు బద్దలు

== సోలంకి రికార్డును దాటిని బిజెపి

== 150 సీట్ల మెజార్టీ దాటగలదన్న అంచనాలు

అహ్మదాబాద్‌,డిసెంబర్‌8(విజయంన్యూస్): గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో 157కిపైగా స్థానాల్లో అధికార బీజేపీ విజయం సాధించింది.  భారీ మెజారిటీతో ఆ పార్టీ విజయదుందుభి మోగించింది. దీంతో గుజరాత్‌ ఎన్నికల్లో పలు పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.. వరుసగా 27 ఏళ్ల గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీ గత ఎన్నికల్లో అత్యధికంగా 127 స్థానాలు మాత్రమే గెలవగలిగింది. కాగా 2002లో ఈ రికార్డ్‌ విజయాన్ని సాధించింది.

ఇది కూడా చదవండి: గుజరాత్‌లో బీజేపీదే హవ్వా

ఇప్పుడు ఆ రికార్డ్‌ బ్రేక్‌ అయ్యింది. మరోవైపు 1985లో మాధవ్‌ సింగ్‌ సొలంకి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ రికార్డ్‌ స్థాయిలో 149 స్థానాల్లో గెలిచి రికార్డ్‌ స్థాయి మెజారిటీని సాధించగా, సామాజిక కూటమి ఖమ్‌ (కోలి క్షత్రియ, హరిజన్‌, ఆదివాసి, ముస్లిం) ఏర్పాటు చేసిన సోలంకి అతి భారీ విజయాన్ని సాధించడంలో సఫలీకృతమయ్యారు. గుజరాత్‌ ఎన్నికలకు సంబంధించి ఇప్పటీ అదే రికార్డుగా ఉంది. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ ను బీజేపీ చెరిపేసింది. గత 27 ఏళ్లుగా గుజరాత్‌ పాలిస్తున్న బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలు 2017లో 99 స్థానాలు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చింది. కానీ తాజా ఎన్నికల్లో చతికిలపడింది. 1985లో రికార్డ్‌ స్థాయి విజయం సాధించిన కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికల్లో అత్యంత చెత్త ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఆశ్చర్యకరంగా ఆప్‌ ఇక్కడ ఖాతా తెరవడం ఖాయమైంది. ఆప్‌ పోటీ చేయడం కాంగ్రెస్‌ భారీ నష్టం చేసిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. తాజా ట్రెండ్స్‌ ప్రకారం.. 154 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. దీంతో అధికార పార్టీకి రికార్డ్‌ స్థాయి విజయం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో 2002 ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 127 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ రికార్డు చెరిగిపోవడం పక్కాగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి  జాతీయ హోదా: మనీశ్ సిసోడియా