Telugu News

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

★ దేశానికే తెలంగాణ స్ఫూర్తిదాయకం

0

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
★ దేశానికే తెలంగాణ స్ఫూర్తిదాయకం
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
దేశ, రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను, పథకాలను విజయవంతంగా అమలుచేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే స్ఫూర్తిదాయకంగా మారిందన్నారు. అతిస్వల్ప కాలంలోనే తెలంగాణ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని, వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులతో తెలంగాణ రైతాంగం ఘన విజయం సాధిస్తుందన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రణాళికాబద్ధంగా సీఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నిరంగాల అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నదన్నారు.

also read :-పచ్చదనం పెంచటంలో ప్రతీ ఒక్కరిదీ బాధ్యతే : వనజీవి రామయ్య

రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్లు మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతుందన్నారు. ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యమన్నారు. అన్నిరంగాల్లో గుణాత్మకమైన, గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించగలిగామని, వాస్తవం కళ్లముందే కనపడుతోందని, ప్రగతి ఫలాలు ప్రజల అనుభవంలో ఉన్నాయన్నారు. విద్యుత్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాల్లో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. దీర్ఘ దృష్టితో రూపొందించిన ప్రనాళిక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలనతో తెలంగాణ స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించిందన్నారు.

also read  :-అదనపు కలెక్టర్ల బదిలీ

2013 -2014 తెలంగాణా ఏర్పడిన నాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు కాగా కొవిడ్‌తో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర అవరోధాలను సృష్టించినప్పటికీ 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,80,407 కోట్లుగా నమోదైందన్నారు. అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,12,126 ఉండగా నేడు అది రూ.2,37,632 చేరుకుందన్నారు. నేడు మన దేశ తలసరి ఆదాయం రూ.1,28,829గా నమోదైందని, దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందన్నారు.

also read :-ప్రభుత్వ భూములును అక్రమిస్తే ఉక్కుపాదం : మంత్రి పువ్వాడ

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలున్న పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పేందుకు గర్విస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాజకీయాలను చూస్తుంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను మొదలు పెట్టారని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని అన్నారు . వ్యక్తి స్వేచ్ఛ , మతస్వేచ్ఛ వంటి గొప్ప వరాలను రాజ్యాంగం తీసుకొచ్చిందని , వాటిని అమలు చేయవలసిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు . జనాభా దామాషా ప్రకారం ఏ కులం ఎంత ఉన్నదో ఆ కులానికి అంత రాజకీయ , ఆర్థిక , సామాజిక , న్యాయం అందినప్పుడు మాత్రమే ఈ రాజ్యాంగం అమలు అయినట్టు అన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన జేఏసీ జిల్లా చైర్మన్ వల్లెపు సోమరాజు , బాసాతి హన్మంతరావు , గారపాటి సోమేశ్వరరావు , సిద్దిక్ , హేమంత్ , గంగాధర్ , రాజేష్ , దాసరి శ్రీనివాస్ , వినోద్ , విజయ్ , కోమలి , సునీల్ , వినయ్ , గణేష్ , మాధురి , పావని , సూర్యసాయి , తనీష్క్ సాయి తదితరులు పాల్గొన్నారు .