Telugu News

ప్రభుత్వ ఆఫీసుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రించండి: హైకోర్టు ఆదేశాలు

చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది

0

💥 ప్రభుత్వ ఆఫీసుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రించండి: హైకోర్టు ఆదేశాలు 💥

చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది

(విజయం న్యూస్);-

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఫోన్లు వాడటం వల్ల కార్యనిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఓ వ్యక్తి అతిగా మొబైల్ వాడుతున్నారనే కారణంతో తనను సస్పెండ్ చేశారని కోర్టును ఆశ్రయించారు.

also read;-దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ నాయ‌క‌త్వ‌మే శ్రీ‌రామ‌ర‌క్ష‌ : భట్టి

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ‘ఆఫీసుల్లో ఫోన్ వినియోగం ఇతర కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకోవాలి. అత్యవసరమైతే కాల్స్ మాట్లాడాలి. లేదంటే సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్‌లో ఉంచాలి. వీలైతే స్విచాఫ్ చేయాలి’ అని కోర్టు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.