ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం.
వారంతపు లాక్ డౌన్ విధించేందుకు సిద్దంగా ఉన్న ఢిల్లీ సర్కార్.
కోర్టుఆదేశాల మేరకు వేచి చూస్తున్న కేజ్రీవాల్ సర్కార్.
(న్యూఢిల్లీ-విజయంన్యూస్):-
దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వారాంతపు లాక్డౌన్ విధించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా లాక్డౌన్ విధింపు ఆధారపడి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది*.
రాజధానిలో తీవ్ర స్థాయికి పెరిగిపోయిన కాలుష్యంపై కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కాలుష్యం కారణంగా ఢిల్లీలోని పాఠశాలల కొనసాగింపుపై ఆలోచించాలని సోమవారం ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచన చేసింది. అయితే భవననిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేసేందుకు మంగళవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విషయమై ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ ”మేము వారాంతపు లాక్డౌన్ పెట్టాలని నిర్ణయించాం. దీనికి మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే కోర్టు ఇచ్చే ఆదేశాలు చాలా కీలకమైనవి, ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది” అని అన్నారు. ఢిల్లీ కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు అత్యవసర సమావేశం కాగా, కేంద్ర ప్రభుత్వం బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది.
also read :- డిప్యూటీ తహసీల్దార్ సూసైడ్.