Telugu News

సాకివాగు అటవీప్రాంత ఘటన దారుణం : మంత్రి సత్యవతి

== ఆదివాసీ మహిళలపై దాడిపై విచారణ

0

సాకివాగు అటవీప్రాంత ఘటన దారుణం : మంత్రి సత్యవతి
== ఆదివాసీ మహిళలపై దాడిపై విచారణ
== అలాంటి అధికారులపై చర్యకు మంత్రి సత్యవతి ఆదేశం
(భద్రాద్రి కొత్తగూడెం-విజయంన్యూస్)
ముల్కలపల్లి మండలం సాకివాగు అటవీ ప్రాంతంలో జరిగిన అమానవీయ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. ఆదివాసీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీగూడెం, సాకివాగు ఘటనపై గిరిజన సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు.

also read ;-ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ర్ట్రాల అభివృద్ది: మోడీ

ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్‌ బీట్‌ గార్డులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ చేసి, నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలపై స్పందించిన ఉన్నతాధికారులు… విచారణ జరపాలని జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సూచించారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి సత్యవతి రాథోడ్‌… మహిళలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అడవిలో జీవనాధారం నిమిత్తం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుసార్లు హెచ్చరించామని గుర్తు చేశారు. అయినప్పటికీ కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు.