Telugu News

=సేవాలాల్ మహారాజు సంక్పలంతో పనిచేయండి: కందాళ ఉపేందర్ రెడ్డి

బంజారులకు అన్నింట్లో సమగౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం

0

==సేవాలాల్ మహారాజు సంక్పలంతో పనిచేయండి: కందాళ ఉపేందర్ రెడ్డి
== బంజారులకు అన్నింట్లో సమగౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం
== తండాలను పంచాయతీలుగా చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దే
== సేవాలాల్ జయంతి ఉత్సవాలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
== కూసుమంచిలో వైభోపేతంగా సేవాలాల్ జయంతి వేడుకలు
== హాజరైన వేలాధి మంది బంజారులు
==(కూసుమంచి-విజయంన్యూస్);-
సేవాలాల్ మహారాజ్ బంజారులకు ఆరాధ్యదైవ్యమని, ఆయన బంజారుల కోసం నిత్యం కష్టపడుతూ వారిలో మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడని, ఆయన సంక్పలస్పూర్తితో బంజార సోదరులందరు పనిచేయాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలో కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ స్థాయి సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కూసుమంచి మండల కేంద్రం నుంచి నేలకొండపల్లి రోడ్డు మీదగా విద్యుత్ సబ్ స్టేషన్ సమీఫంలో సేవాలాల్ దేవాలయం కోసం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి దాతగా వితరణ చేసిన స్థలం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంస్కృతి సంప్రధాయ పద్దతిలో నత్యాలు చేశారు.. కోలాటమేశారు. యువకులు, బంజార సోదరులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.

also read:-==ఆదాయ వనరులను పెంపొందించాలి : సండ్ర

అనంతరం సేవాలాల్ మహారాజ్ దేవాలయ స్థలానికి వచ్చిన బంజారులు అక్కడ గిరిజన సంస్కతి సంప్రధాయ పద్దతిలో బోగబండార్ ను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరైయ్యారు. ఆయన్ను కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, తిరుమలాయపాలెం ఎంపీపీ బోడా మంగిలాల్, సేవాలల్ సేన రాష్ట్ర అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్, ఎంపీటీసీ జర్పుల బాలాజీ నాయక్, సేవాలాల్ జయంతి వేడుకల కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు గిరిజన సంస్కతి సంప్రధాయ దుస్తులను అందించి, తలపాగ చుట్టి గిరిజన భాషలో మాట్లాడే విధంగా చేశారు. దీంతో ఎమ్మెల్యే వారిని రామ్ రామ్ అంటూ వారిని మర్యాధ పూర్వకంగా అప్యాయంగా పలకరించారు. అనంతరం ఎమ్మెల్యేను బంజారులు ఘనంగా సన్మానించి, సేవాలాల్ పోటోను జ్జాపికగా అందజేశారు.

also read :-*రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.,……

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గానికి బంజార సోదరులు చాలా కీలకమని అన్నారు. బంజారులు ఉన్నతంగా, సామాజకంగా ఎదిగేందుకు సంత్ సేవాలాల్ చేసిన క షిని కొనియాడారు. లంబాడీ గూడేలు, తండాలు ఊరికి శివారు ప్రాంతాల్లో ఉంటే ప్రజల్లో ఉండాలని, చదువుకోవాలని, అన్ని రంగాల్లో రాణించాలని వారందరిని చైతన్యం చేసేందుకు చాలా కష్టపడ్డారని అన్నారు. వారి చైతన్యంతో ఇప్పుడు చాలా మంది గిరిజనులు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని తెలిపారు. గిరిజనులు అందరు ఐక్యంగా ఉండటం చాలా సంతోషమన్నారు. సేవాలాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువకులు ముందుకు సాగాలని కోరారు.

బంజారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో పనిచేస్తుందని తెలిపారు. బంజారుల కోసం తండాలను పంచాయతీలుగా మార్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. అలాగే తండాలకు ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ అభివ ద్ది చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గిరిజనులందరు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే కచ్చితంగా రాబోయే రోజుల్లో మరింతగా తండాలను అభివ ద్ది చేస్తామని తెలిపారు.

also read :-తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. తునాతునకలైన మృతదేహాలు

ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంకుమార్ నాయక్, మాజీ జడ్పీటీసీ వడ్తియా రాంచంద్రునాయక్, బానోతు రవినాయక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల శ్రీనివాస్ నాయక్, బాదావత్ రవినాయక్, జర్పుల మోతిలాల్, బిక్ష్మం నాయక్, భాస్కర్ నాయక్, రామకోటి నాయక్, లచ్చునాయక్, మంచానాయక్, రాములునాయక్, బాసునాయక్, బొంగానాయక్, సర్పంచులు శ్యామ్ సుందర్ రెడ్డి, వెంకట్ నాయక్, బానోతు కిషన్ నాయక్, బానోతు నాగేశ్వరరావు,కిష్ణమూర్తి నాయక్, వడ్తియా రాజేష్, జగిత్యానాయక్, కోటి, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు వడ్తియా బాలునాయక్, బిక్షపతి, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు హాజరైయ్యారు.