దళితులకు అవమానం..
== హోమంకు రానీవ్వని ఇవ్వని ఆగ్రకులస్తులు
== ఆగ్రహించిన దళితులు.. ఆలయం వద్దనే ధర్నాకు దిగిన దళితులు
== ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామంలో సంఘటన
(ఖమ్మం రూరల్/కూసుమంచి-విజయంన్యూస్);-
అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు
అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు రాజ్యంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవానికి ఒక్క రోజు ముందు దళితులకు అవమానం జరిగింది.. మీరు దళితులు, మీరు ఆలయంలోకి వచ్చే ప్రసక్తే లేదంటూ గ్రామంలోని కొందరు అడ్డుపడటంతో ఆగ్రహించిన దళితులు ఆ ఆలయం వద్దనే ధర్నా చేసిన పరిస్థితి బుధవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం రూరల్ మండలంలోని చింతపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది.
also read :-మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య
ఈ ఆలయ నిర్మాణానికి గ్రామంలో చాలా మంది దాతలు దానాలతో నిర్మాణం చేశారు. అయితే ఆ ఆలయానికి ఎస్సీలను రావొద్దని ఆధిపత్య కులాలు హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఆగ్రహించిన దళితులు ఆ గుడి సమీపంలోనే ధర్నాకు దిగారు. నేటి సమాజంలో దళితులను ఆలయానికి రానివ్వకుండా ఉండటం పట్ల దళితజాతికే అవమానం జరిగిందని అన్నారు. ఈ ఘటనపైన ఆగ్రామాన్ని కెవిపిఎస్ జిల్లా, మండల నాయకత్వం సందర్శించి ఎస్సీలకు న్యాయం చేయాలని, కులవివక్ష పాటించిన వారిపైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసును నమోదు చేసి దళితులకు రక్షణ కల్పించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి పాపిట్ల సత్యనారాయణ, గ్రామ ఉప సర్పంచ్ ఆరేంపుల ఉప్పలయ్య, చీమ రామారావు, వేమూరి లక్ష్మీనారాయణ, చిర్రా నవీన్, ఆరేంపుల వెంకన్న, చీమ వెంకన్న, ఆరేంపుల శ్రీకాంత్, కొట్టే కృష్ణ, ఆరేంపుల కేశవులు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.