Telugu News

*మహిళా గవర్నర్ కు గుర్తింపు లేని రాష్టంలో మహిళా బంధా..?: సౌజన్య

** అసెంబ్లీ సమావేశం సాక్షిగా మొదటి పౌరురాలుకు అవమానం

0

*మహిళా గవర్నర్ కు గుర్తింపు లేని రాష్టంలో మహిళా బంధా..?: సౌజన్య** అసెంబ్లీ సమావేశం సాక్షిగా మొదటి పౌరురాలుకు అవమానం

** మహిళలంటే కేసీఆర్ కు చిన్నచూపు

** మహిళలకు ఏం చేశారో బహిరంగ లేక విడుదల చేయండి

👉🏻 విలేకర్ల సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-

రాష్ట్ర ప్రథమ పౌరురాలైన మహిళా గవర్నర్ కూ గౌరవం ఇవ్వలేరు గానీ మహిళల అభివృద్ధికి మహిళా బంధు ప్రవేశపెడతారా..? అంటూ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య విమర్శించారు. ఆదివారం మహిళా కాంగ్రెస్ ఆద్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ…మహిళలకు గౌరవం ఇవ్వలేని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను మహిళా బంధుతో ఆదుకుంటదా అని అన్నారు.

also read;-ఉక్రెయిన్ లో బస్సు చార్జీల బాదుడు..
టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలా స్వయం సమృద్ధికి ఉపయోగపడే స్వయం సహాయక సంఘాలను, అభయ హస్తం,వంటి పథకాలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. రాష్టంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి చోటా మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఉన్న పథకాలనే పేరు మార్చి వాటినే అమలు చేస్తూ మహిళాల కోసం అది చేసాం ఇది చేసామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఘాటుగా విమార్చించారు. నేడు రాష్ట్రములో వితంతు మహిళలకు ఫించన్లు రాక ఎంతో మంది నిరాశతో ఉన్నారని అన్నారు. కేసీఆర్ 7 ఏండ్ల పాలనా కాలంలో ఏ ఒక్కరికి మంచి చేసిందే లేదు అని మండిపడ్డారు. రైతు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఒంటరి మహిళలపై దాడులు ఎన్నో ఉన్నాయని అన్నారు.మహిళా శక్తి ఎదుగుదలకు ఉపయోగపడని ఎన్ని మహిళా బంధులున్నా ఒరిగింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

also read;-నన్ను సజీవంగా చూడటం ఇదే చివరి సారి కావచ్చు..జెలెన్ స్కీ భావోద్వేగం..
లింగాల కమల్ రాజు కాలం కలిసివచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ అయి మతీస్తమితం కోల్పోయి మాట్లాడుతున్నారని దూషించారు.సీఎల్ఫీ నేత మధిర శాసనసభ సభ్యులు మల్లు భట్టీ విక్రమార్క గారిపై మూడు సార్లు ఓడిపోయినా ఇంకా లింగాలకు సిగ్గు రాలేదని అన్నారు. మధిర నియోజక వర్గ ప్రజలకి ఎవరు ఏంటో తెలిసే మూడు సార్లు భట్టీ గారిని గెలిపించుచుకున్నారని అన్నారు.ఎన్నికకు ఒక పార్టీ మార్చే లింగలాకు భట్టీగారిని విమర్శించే స్థాయి లేదని అన్నారు. స్ధాయిని మించి విమర్శలు చేసే ముందు తన స్థాయి ఏంటో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఇకనైనా విమర్శలు మాని మహిళా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల, రాఫీదా భేగం, రఘునాధపాలెం మండల నాయకురాలు స్వాతి, ఖమ్మం టౌన్ నాయకురాలు దివ్య తదితరులు పాల్గొన్నారు.