Telugu News

భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

= అయినా మూడు లక్షలకు పైగానే కేసులు

0

భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
== అయినా మూడు లక్షలకు పైగానే కేసులు
== మహమ్మారి కారణంగా 488 మంది మృతి
== కరోనా టీకాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
== కరోనా వచ్చి తగ్గిన తరవాత 3నెలల వరకు నో వ్యాక్సిన్‌
(న్యూఢిల్లీ-విజయంన్యూస్)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశంగా చూడాలి. ఇదే క్రమంలో పిల్లలకు వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్‌ డోస్‌ కూడా కొనసాగుతోంది. ఇది సాధారణ వైరస్‌గా మారుతోందన్న నిపుణుల పరిశోధనలు ఊరటనిస్తున్నాయి.

also read :-గ్రానైట్, అనుబంధ చిన్న తరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తాం : మంత్రి పువ్వాడ

దేశవ్యాప్తంగా శుక్రవారం 3,37,704 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 488 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారంతో పోల్చుకుంటే.. శుక్రవారం కేసులు, మరణాల సంఖ్య తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 17.22 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 21,13,365 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 2,42,676 మంది బాధితులు కోలుకున్నారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 38903748 కి చేరింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 488884 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో 36291435 మంది కోలుకున్నారనని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సైతం అలజడి సృష్టిస్తోంది.

also read :-పట్టణంలో ప్రభుత్వ స్థలాల అక్రమణలపై సమగ్ర నివేదిక కావాలి==

రోజురోజుకూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 10,050 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చుకుంటే.. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 3.69 శాతం పెరిగింది. ఇదిలావుంటే కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వ్యక్తులకు బూస్టర్‌ డోస్‌ ఇచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్టాల్రకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు తాజాగా రాష్టాల్రకు లేఖ రాసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే 3 నెలల వరకు బూస్టర్‌ డోస్‌, ముందుజాగ్రత్త డోస్‌ వేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. కరోనా సోకిన వ్యక్తులు కోలుకున్న తర్వాత వచ్చే 3 నెలల వరకు వారికి ఎలాంటి వ్యాక్సీన్‌లు ఇవ్వకూడదని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో.. దేశంలో బూస్టర్‌ డోస్‌,ప్రికాషన్‌ డోస్‌ ను వేయడం ప్రారంభించారు. ఇదే అంశంపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్‌ షెల్లీ విూడియాతో మాట్లాడారు. కోవిడ్‌ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు ప్రికాషన్‌ డోస్‌ ఇవ్వడంపై మార్గదర్శకాల కోసం వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చాయన్నారు. ఈ మేరకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు.