‘టేల్స్ ఆఫ్ డిఫరెంట్ టెయిల్స్ ’బుక్ సిరీస్‌ను విడుదల చేసిన సోనాలికా పబ్లికేషన్స్
మెరుగైన సమాజ నిర్మాణం కోసం విద్యతో కూడిన గట్టి పునాది ఉండాలనే నమ్మకం కలిగిన సోనాలికా పబ్లికేషన్స్
(విజయం న్యూస్):-
దేశ వ్యాప్తంగా ప్రతి ప్రాంతాన్నీ చేరుకునేందుకు సమ్మిళిత విద్యను ప్రచారం చేయడంపై దృష్టి కేంద్రీకరించింది. విభిన్న జెనర్స్‌ను పరిచయం చేస్తూ వైవిధ్యమైన ప్రచురణలను తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకున్న సోనాలికా, అభ్యాసాన్ని ఆసక్తికరంగా మార్చాలని ప్రయత్నిస్తుంది.సమ్మిళితత దిశగా తమ ప్రయత్నాలలో భాగంగా సోనాలికా ఇప్పుడు తమ ప్రచురణలను ఇంగ్లీష్, హిందీ భాషలలో చేస్తుంది. అంతేకాకుండా తమ ప్రచురణలన్నీ కూడా పర్యావరణ అనుకూలమన్నట్లుగాఉండేలా రీసైకిల్ పేపర్‌పై తమ ప్రచురణలను ముద్రితం చేస్తుంది సోనాలికా పబ్లికేషన్స్.
also read;-మళ్ళీ వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పై తెగబడుతున్న దొంగలు
తమ తొలి ప్రచురణ నుంచి యువ అభ్యాసకుల మనస్సులను తీర్దిదిద్దడంతో పాటుగా వారికి స్ఫూర్తి కలిగించేందుకు సోనాలికా పబ్లికేషన్ తమ వంతు ప్రయత్నాలను చేస్తుంటుంది. దీనిలో భాగంగా ఇప్పుడు మరోమారు అది నూతన సిరీస్ ‘టేల్స్ ఆఫ్ డిఫరెంట్ టెయిల్స్’ అంటూ వచ్చింది. ఇది ఇతర అవసరమైన విలువలను ఒడిసిపట్టడంతో పాటుగా మన లోపల దాగిన చిన్నారిని బయటకు తీసుకువచ్చి, జీవితాన్ని పూర్తి వినోదంగా జీవించేలా చేస్తుంది. ఈ సిరీస్‌తో నిత్య జీవితంలో మనమనసుల్లో అల్లరి చేసే చిన్నారిని వెలికి తీసే ప్రయత్నం చేశారు. మన మనసుల్లో గూడుకట్టుకున్న తుంటరి తనాన్ని ‘టేల్స్ ఆఫ్ డిఫరెంట్ టెయిల్స్’ వేడుక చేస్తుంది. ఈ సిరీస్ తల్లి–కుమారుల ద్వయం అనంత్ మిట్టల్ మరియు అతని మాతృమూర్తి శ్రీమతి సురభి మిట్టల్ రచించారు.
also read;-వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం
సోనాలికా గ్రూప్ సీఎస్‌ఆర్ డైరెక్టన్ శ్రీమతి సురభి మిట్టల్ మాట్లాడుతూ ‘‘ నేటిడిజిటల్ ప్రపంచంలో పుస్తకాలు గతానికన్నా ప్రాముఖ్యత కలిగి ఉండటంతో పాటుగా శక్తివంతంగానూ మారాయి. మన సంస్కృతిలో దాగిన కథలను ముందుకు తీసుకువెళ్లడమే కాదు, నీతి వంతమైన విలువలు, అభ్యాసాన్ని తీసుకువెళ్తాయి. కథనం ఆసక్తిగా మలవాలంటే ఆ ప్రాతలతో పాటుగా జంతువులు కూడా భాగంగా ఉండాలి. ఎందుకంటే చిన్నారులు, అమితంగా జంతువులను అభిమానిస్తారు. తమను తాము వాటిలో చూసుకోవడమూ చేస్తారు. తుంటరితనం యొక్క విలువలు మరియు స్ఫూర్తిని ఈ పుస్తకంలో చర్చించాము. మనందరిలో దాగిన చిన్నారిని ఈ సిరీస్ కనెక్ట్‌కాగలరు. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మరిన్ని రచనలతో రానున్నామ’’ ని అన్నారు.