Telugu News

తల్లిదండ్రులున్నంత కాలం ఆస్తిపై కొడుకులకు హక్కు లేదు

బాంబే హైకోర్టు తీర్పు

0

తల్లిదండ్రులున్నంత కాలం ఆస్తిపై కొడుకులకు హక్కు లేదు

👉బాంబే హైకోర్టు తీర్పు

(బాంబే విజయం న్యూస్):-

ముంబై: తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం వారి ఆస్తిపై కుమారులకు హక్కు ఉండదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. తన భర్త అనారో గ్యంతో జీవచ్ఛవంలా మారారని, ఆయన పేరు మీద ఉన్న ఆస్తులపై తనకే హక్కు ఉన్నట్టుగా ప్రకటించాలని సోనియా ఖాన్ అనే మహిళ కోర్టును ఆశ్ర యించారు.

also read;-కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఆర్టీసీకి నష్టాలు

అదే సమయంలో తండ్రి ఆస్తులపై తనకే హక్కు ఉందని ఆమె కుమారుడు ఆసిఫ్ ఖాన్ వాదించాడు. తండ్రి బాగోగులు తనే చూసుకొంటు న్నట్టు చెప్పాడు. అయితే అందుకు ఎలాంటి ఆధారాన్ని చూపలేదు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలం వారి ఆస్తిపై కుమారులకు హక్కు ఉండదని తెలి పింది. ఈ కేసులో భార్యకే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, అనార్యోగంతో ఉన్నప్పుడు వారసత్వా నికి సంబంధించి చట్టాల్లో ఎక్కడా లేదని ఈ సందర్భంగా పేర్కొన్నది.*