Telugu News

10లోగా కొత్త వారికి ఓటు హక్కు: ఈసీ

ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు

0

10లోగా కొత్త వారికి ఓటు హక్కు: ఈసీ

== ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు

== మా గోడ గడియారంలోని సమయమే ప్రామాణికం_

== హైదరాబాద్‌లోనే నమూనా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ_

== 60 మంది వ్యయ పరిశీలకులు

(హైదరాబాద్-విజయం న్యూస్)

కొత్తగా దరకాస్తు చేసుకునే ప్రతి ఒక్క కొత్త ఓటర్ కు కచ్చితంగా ఓటు హక్కు కల్పిస్తామని, ఈనెల 10లోపు

తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనున్నాం. ఈ ప్రక్రియకు ముందు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. అందుకోసం గవర్నర్‌ అనుమతి తీసుకున్నాం’’ అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి:-;నేడు తెలంగాణకు ఈసీ బృందం

రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఓటర్ల నమోదు, పోలింగ్‌ కేంద్రాలు, నామినేషన్ల ప్రక్రియలో నియమ నిబంధనలు, ఎన్నికల భద్రత, వ్యయ పరిశీలకులు, ఉచితాల స్వాధీనాలు తదితర అంశాలను వివరించారు. ఆయా వివరాలు ఆయన మాటల్లోనే….*

_10లోగా కొత్త వారికి ఓటు హక్కు_

*తుది ఓటర్ల జాబితా ప్రకటించాక కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దాంతో ఇప్పటికే నిర్ధారించిన 35,356 పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా మరిన్ని అనుబంధ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనిపై ఈ వారంలో నిర్ణయం తీసుకుంటాం. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ నవంబరు 10వ తేదీలోగా ఓటు హక్కు కేటాయిస్తాం. పోలింగ్‌ సమయంలో ఆ ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకుంటాం.*

_మా గోడ గడియారంలోని సమయమే ప్రామాణికం_

*నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చు. అవే పత్రాలను సంబంధిత ఎన్నికల అధికారికి ప్రత్యక్షంగా ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారుల గదిలో ఏర్పాటు చేసిన గోడ గడియారంలోని సమయమే ప్రామాణికం. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల స్వీకరణ నిలిపేస్తాం. ఈ ప్రక్రియను సీసీ టీవీల ద్వారా రికార్డు చేస్తాం. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్ల వరకు వేయవచ్చు. అఫిడవిట్ల విషయంలో అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలి. అభ్యర్థులిచ్చిన అఫిడట్లను అదే రోజు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయిస్తాం. నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయంలోని నోటీసు బోర్డులోనూ పెడతాం.*

_హైదరాబాద్‌లోనే నమూనా బ్యాలెట్‌ పత్రాల ముద్రణ_

*పోస్టల్‌, నమూనా బ్యాలెట్‌ పత్రాలన్నింటినీ హైదరాబాద్‌లోనే ముద్రించాలని నిర్ణయించాం. గతంలో గుర్తుల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. స్వతంత్ర అభ్యర్థులు, అన్‌ రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థుల కోసం గుర్తులను అందుబాటులో ఉంచాం.*

_60 మంది వ్యయ పరిశీలకులు_

*అభ్యర్థుల వ్యయ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు 60 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వారు శుక్రవారానికి రాష్ట్రానికి చేరుకుంటారు. సాధారణ, పోలీసు పరిశీలకులను ఖరారు చేయాల్సి ఉంది. బందోబస్తు వ్యవహారాల పర్యవేక్షణకు రాష్ట్రానికి చెందిన అన్ని యూనిఫాం సర్వీసుల నుంచి 65 వేల మంది పోలీసులను వినియోగించనున్నాం. 2018 ఎన్నికల్లో 300 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం పంపింది. ప్రస్తుత ఎన్నికల కోసం ఇప్పటివరకు 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయి.*

_రూ.33 కోట్ల విలువైన ఉచితాల స్వాధీనం_

*తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు రాజకీయాలతో సంబంధం లేనిదని నిర్ధారణ అయిన వెంటనే సంబంధీకులకు తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. వివిధ రాజకీయ పార్టీలు పంపిణీ కోసం సిద్ధం చేసిన రూ.33 కోట్ల విలువైన తాయిలాలను స్వాధీనం చేసుకున్నాం.*