Telugu News

ఎండ తీవ్రత తో వడ దెబ్బకు గురైన

ముజఫర్ హుస్సేన్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్య

0

ఎండ తీవ్రత తో వడ దెబ్బకు గురైన

ముజఫర్ హుస్సేన్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్య 

(గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్):-

ములుగు జిల్లా,తడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముజఫర్ హుస్సేన్ గారు విపరీతమైన ఎండ తీవ్రతతో వడ దెబ్బ కి గురైనాడు. నిన్న సాయంత్రం విషయం తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్య బయల్దేరి వెళ్లి వారిని పరామర్శించిండం జరిగింది. ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలందరు బయటికి వెళ్లే సమయంలో సీతలపానియాలు వెంట తీసుకెళ్లాలని సూచనలు ఇచ్చారు.

also read;-పరిశుభ్రతే..మనిషికి ప్రధాన రక్షణ..

అదేవిధంగా నాయకుల కార్యకర్తల యోగక్షేమాలు తెలుసుకోవటం జరిగింది
ఈ కార్యక్రమంలో తాడువాయి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడి సతీష్ కుమార్, PACS వైస్ చైర్మన్ లాలయ్య,నరేష్, కాటా పూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి మధు, పుల్లూరు నాగార్జున, లంజపల్లి నర్సయ్య, మాజీ సర్పంచ్ ముత్తినేని లక్ష్మయ్య, మేడిశెట్టి పుల్లయ్య, మూతి శీను, బడే రాంబాబు, మాజీ సర్పంచ్ గంగారం రహిమాన్, మరియు కాటాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.