Telugu News

కరాటేలో పాలకుర్తి విద్యార్థుల ప్రతిభ

ఆరు బంగారు పతకాలు కైవసం

0

కరాటేలో పాలకుర్తి విద్యార్థుల ప్రతిభ

ఆరు బంగారు పతకాలు కైవసం
-నాలుగువెండి,రెండు కాంస్య పతకాలు సాధించిన విద్యార్థులు

-విద్యార్థులను అభినందించిన సినీహీరో సుమన్ తల్వార్

కరాటే మాస్టర్ గుగ్గిళ్ళ దేవేందర్ ఆధ్వర్యంలో శిక్షణ

(పాలకుర్తి విజయం న్యూస్) :-

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో సుమన్ షోటాకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా ఆర్గనైజర్ మాస్టర్ జల్లేల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 రాష్ట్రాలకు చెందిన 8 వందల మంది విద్యార్థులతో జరిగిన 24 వ జాతీయ స్థాయి కుంగ్ పూ,కరాటే చాంపియన్ షిప్ పోటీలలో న్యూ స్టార్ చైనీస్ కుంగ్ పూ అకాడమీ పాలకుర్తి బ్రాంచికి చెందిన విద్యార్థిని,విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనపరచి బహుమతులు గెలుపొంది సినీ హీరో మాస్టర్ సుమన్ తల్వార్ చేతులమీదుగా బహుమతులు అందుకున్నారని న్యూ స్టార్ చైనీస్ కుంగ్ పూ అకాడమీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాస్టర్ గుగిల్ల దేవేందర్ తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అండర్ 10 సంవత్సరాల కటాస్ బాలికల విభాగంలో క్రితిక ,శాన్విక గోల్డ్,సిల్వర్ మెడల్ అండర్ 9 సంవత్సరాల కటాస్ బాలుర విభాగంలో ఉమేష్ , శ్రీ వర్ధన్ గోల్డ్ , భ్రాంజ్ మెడల్ అండర్ 12 సంవత్సారాల బాలుర కటాస్ విభాగంలో సాక్షిత్,రామ్ చరణ్ ,అభినాష్ గోల్డ్, సిల్వర్,బ్రాంజ్ మెడల్
అండర్ 14 సంవత్సరాల కటాస్ బాలుర విభాగంలో విక్రాంత్ గోల్డ్ మెడల్ అండర్ 12 సంవత్సరాల స్పారింగ్ బాలికల విభాగంలో కీర్తి గోల్డ్ మెడల్ అండర్ 12 సంవత్సరాల స్పారింగ్ బాలుర విభాగంలో జయ వర్ధన్ సిల్వర్ మెడల్ అండర్ 14 సంవత్సరాల స్పారింగ్ బాలుర విభాగంలో రాకేష్,సుధీర్ గోల్డ్,సిల్వర్ మెడల్ సాధించారన్నారు

వీరినిగ్రాండ్ మాస్టర్ ఎండీ సలీం పాషా అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

also read :- కూకట్ పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్వోటీ పోలీసులు ..