Telugu News

శ్రీలంకపై టీమీండియా ఘన విజయం

238 పరుగుల అత్యధికంతో ఘన విజయం

0

శ్రీలంకపై టీమీండియా ఘన విజయం
== 238 పరుగుల అత్యధికంతో ఘన విజయం
== 2-0 తో క్లీన్ స్వీఫ్ చేసిన రోహిత్ సేనా
(హైదరాబాద్-విజయంన్యూస్);-
రోహిత్ రథసారథ్యంలో టీమీండియా విజయపరంపర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో సోమవారం జరిగిన మ్యాచ్ లో భారత క్రీకెటర్లు 238 పరుగుల అధిక్యంతో ఘనవిజయం సాధించారు. ఐదు రోజుల మ్యాచ్ గా ప్రారంభమైన రెండవ టెస్ట్ లో కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.

also read :-కొత్త కేంద్రీయ విద్యాలయాల‌ (కేవీ) ఏర్పాటుపై చ‌ర్య‌లేవీ?

మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ వెంచుకున్న టీమీండియా బ్యాట్స్ మెన్స్ 252 పరుగులు చేయగా, రెండవ ఇన్నింగ్స్ 303 పరులు చేసి డిక్లీర్ చేసింది. కాగా శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆలౌట్ కాగా రెండవ ఇన్నింగ్స్ లో 208పరుగుల తక్కువ స్కోర్ కే చేతులేత్తేసింది. దీంతో రోహిత్ సేనా రెండవ టెస్ట్ ఘనవిజయం సాధించగా, రెండు టెస్టుల సీరిస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసి సీరిస్ ను కైవసం చేసుకుంది. కాగా భారతటీమ్ సభ్యులకు ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో వెస్టిండిస్ తో జరిగిన టీ20, వన్డే, మ్యాచ్ లలో క్లీన్ స్వీఫ్ చేసిన భారత్ టీమ్, ఇటీవలే శ్రీలంకతో జరిగిన టీ20, టెస్ట్ సీరిస్ లో క్లిన్ స్వీఫ్ చేసి చరిత్ర స్రుష్టించింది. దీంతో రోహిత్ సేనాకు యావత్త్ భారత అభిమానులు అభినందనలతో హోరేత్తిస్తున్నారు.