కర్ణాటకలో క్యాబినెట్ కు ముహుర్తం ఖారారు
== ఆ రోజున సీఎంతో సహా మంత్రులు ప్రమాణస్వీకారం
== హాజరుకానున్న సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, పలువురు పీసీసీ. సీఎల్పీలు
(కర్నాటక-విజయంన్యూస్)
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముహుర్తం ఖారారైంది.. ఆ రోజున సీఎం తో సహా మంత్రులు ప్రమాణస్వీకారం చేసేందుకు సుముహుర్తాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్న కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్నాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. 136 సీట్లతో వన్ సైడ్ వార్ తరహాలో మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
ఇది కూడా చదవండి: పొంగులేటి.. ఊ.. అంటారా..? ఊఊ అంటారా..?
కర్ణాటకలో ఎన్నడు లేని విధంగా అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సహాంతో ఉరకేలేస్తుంది.. ఈ విజయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. అనేక ఎన్నికల్లో వన్ సైడ్ రిజల్ట్ ను పొందే బీజేపీ పార్టీకి కర్ణాటక ప్రజలు షాక్ మీద షాక్ ఇచ్చారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా అద్భుతమైన మెజారిటి ఇవ్వడంతో బీజేపీ కంగుతింది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విజయంతో నూతన ఉత్సహంతో ఉంది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఖాయం అంటూ సంబరాలు చేసుకున్నారు. కాగా కర్ణాటక కొత్త సీఎం ఎవరు..? అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నేలకొంది.. సీనియర్ నేత, మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్య హోరాహోరీ పోరు ఉంది. వారిలో ఎవరికి వచ్చిన మాకు అభ్యంతరం లేదని కర్ణాటక లో నూతనంగా విజయం సాధించిన ఎమ్మెల్యేలు చెబుతుండగా కర్ణాటక ప్రజలు మాత్రం సిద్దరామయ్య వైపు మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం డీకే శివకుమార్ కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
ఇది కూడా చదవండి: అధర్మంపై సత్యమే గెలిచింది: సంభాని
అయితే సీఎం పదవి ఎవరికి వచ్చిన కలిసి పనిచేసేందుకు మేము సిద్దంగా ఉన్నామని సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు ప్రకటించి వారి ఐక్యతను చాటుతున్నారు.
== ప్రభుత్వ ఏర్పాటుకు ముహుర్తం ఖరారు
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది. సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు తేదిని ఖారారు చేశారు. ఈనెల 18న ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ముహుర్తాన్ని ఖరారు చేసింది. ఆ రోజున సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాజస్తాన్, చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎల్పీ, పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులను హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.