కర్టాటక సీఎం ఎంపిక నిర్ణయం హైకమాండ్ దే
డీకే శివకుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపర్చిన సిద్దరామయ్య, ఎమ్మెల్యేలు
కర్టాటక సీఎం ఎంపిక నిర్ణయం హైకమాండ్ దే
== సీఎల్పీ బేటిలో ఏకగ్రీవ నిర్ణయం
== డీకే శివకుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపర్చిన సిద్దరామయ్య, ఎమ్మెల్యేలు
== 18న ప్రకటించే చాన్స్ ..?
(కర్ణాటక-విజయంన్యూస్)
కర్ణాటక సీఎల్పీ మీటింగ్ ఆదివారం జరిగింది.. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకు సీఎల్పీ సమావేశం నిర్వహించగా, బెంగుళూరులో అత్యవసరంగా సమావేశం జరిగింది. సీఎంను ప్రకటిస్తారని అందరు ఊహించారు. సీఎం ఎవరనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నేలకొంది. కానీ సీఎల్పీ సమావేశంలో సీఎం గా ఎవర్ని ప్రకటించిన అభ్యంతరం లేదని, సీఎంను ప్రకటించే బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
allso read- కర్ణాటకలో క్యాబినెట్ కు ముహుర్తం ఖారారు..ఎప్పుడంటే..?
ముందుగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ గెలిచిన ఎమ్మెల్యేలందరికి అభినందనలు తెలుపుతూ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులందరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలకు అద్భుతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సీఎం అభ్యర్థిని ఎవర్ని ప్రకటించిన అభ్యంతరం లేదని, అందరి కలిసి పనిచేస్తామని అన్నారు. సీఎంను ప్రకటించే బాధ్యత హైకమాండ్ కు అప్పగించాలని తీర్మాణాన్ని ప్రవేశపెట్టగా, సిద్దరామయ్య, ఎమ్మెల్యేలు ప్రతిపాధిస్తూ సంతకాలు చేశారు. పరిశీలకులకు తీర్మాణాన్ని లేఖను అందించారు. దీంతో కర్ణాటక సీఎంను ప్రకటించే బాధ్యతను అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లకు తీసుకున్నారు. అయితే ఈనెల 18న సీఎంను ప్రకటించే అవకాశం ఉండగా, అదే రోజు సీఎంతో పాటు మంత్రులు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: పొంగులేటి.. ఊ.. అంటారా..? ఊఊ అంటారా..?