Telugu News

రేపు శ్రీలంకతో చివరి రెండో టెస్ట్‌

పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌

0

రేపు శ్రీలంకతో చివరి రెండో టెస్ట్‌
== పింక్‌ బాల్‌తో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌
== సిరాజ్‌కు స్థానం కల్పించే ఛాన్స్‌
(బెంగళూరు-విజయంన్యూస్);-
భారత్‌`శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్‌ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరగనుంది. ఇది డే`నైట్‌ టెస్ట్‌. ఇందులో క్రికెట్‌ ఎరుపు రంగుకు బదులుగా పింక్‌ బాల్‌తో ఆడనున్నారు. శనివారం శ్రీలంకతో భారత్‌ తన నాలుగో డే`నైట్‌ మ్యాచ్‌ ఆడనుంది. భారత జట్టు ఫిబ్రవరి 2021లో ఇంగ్లాండ్‌తో చివరి డే`నైట్‌ టెస్టు ఆడిరది. పింక్‌ బాల్‌ టెస్ట్‌ గా పిలిచే డే`నైట్‌ టెస్ట్‌, ఇతర టెస్టుల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది.

also read :-పాలేరు కారు పార్టీలో కలవరం

పింక్‌ బాల్‌ లైట్లలో ఎక్కువగా కనిపిస్తుందని, ఈ మేరకు బాల్‌ను ఐసీసీ మార్చింది. శ్రీలంకతో టెస్టులో భారత జట్టు బౌలింగ్‌ కూర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. శనివారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ క్లీన్‌స్వీప్‌ సాధిస్తుంది. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో మూడో స్పిన్నర్‌గా జయంత్‌ యాదవ్‌ అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో అతడిని ఈ టెస్టులో ఆడిరచడం సందేహంగానే మారింది. అదే జరిగితే తన స్థానంలో గాయం నుంచి కోలుకున్న అక్షర్‌ పటేల్‌ లేక మూడో పేసర్‌గా సిరాజ్‌ను బరిలోకి దింపుతారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటిదాకా ఆడిన రెండు పింక్‌ బాల్‌ టెస్టుల్లోనూ పేసర్ల ఆధిపత్యంతోనే భారత్‌ నెగ్గింది. ఇక బెంగళూరు వేదికగా జట్టుకిదే తొలి డే/నైట్‌ టెస్టు. సహజంగా ఈ పిచ్‌పై తొలి మూడు రోజులు బ్యాటర్స్‌దే హవా ఉంటుంది.

also read :-మహిళల ప్రపంచకప్‌లో రేపే కీలక టెస్ట్‌

చివరి రెండు రోజులే స్పిన్నర్లు కీలకమవుతారు. ఈ కారణంగా సంప్రదాయక ఫార్ములా ప్రకారమే వెళ్లే అవకాశం లేకపోలేదు. కానీ ఎస్‌జీ బంతి కాబట్టి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ విభిన్నంగా ఆలోచించి ముగ్గురు పేసర్లను కూడా ఆడిరచవచ్చు. ఇక్కడ ఎర్ర మట్టితో కూడిన పిచ్‌ ఉంటుంది కాబట్టి పగుళ్లు రాకముందు తొలి రెండు రోజులు పేసర్లు లాభపడే చాన్స్‌ ఉంది. అటు 30డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి పగుళ్లు త్వరగానే ఏర్పడతాయి. అంతేకాకుండా సాయంత్రం చల్లగాలులు వీచే అవకాశం ఉండడంతో సీమర్లు బంతితో స్వింగ్‌ సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు. అదీగాకుండా ఐపీఎల్‌లో సిరాజ్‌కిది హోంగ్రౌండ్‌ కాబట్టి తనకు చిన్నస్వామి స్టేడియంపై చక్కటి అవగాహన ఉంటుంది. అందుకే కెప్టెన్‌ రోహిత్‌ అక్షర్‌కన్నా సిరాజ్‌ను తుది జట్టులో చేర్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.