Telugu News

మోడీ ప్రభుత్వం కాశీ ముఖ చిత్రాన్నే మార్చేసింది..

చారిత్రక వారసత్వ సంపద ధర్మ పరిరక్షకుడు ప్రధాని నరేంద్ర మోడీ...

0

మోడీ ప్రభుత్వం కాశీ ముఖ చిత్రాన్నే మార్చేసింది..

* చారిత్రక వారసత్వ సంపద ధర్మ పరిరక్షకుడు ప్రధాని నరేంద్ర మోడీ…

బిజెపి జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి..

కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం వారణాసిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ ముఖచిత్రాన్ని మార్చేసిందని, శ్రీ కాశీ విశ్వనాథ్ కారిడార్ పేరిట వందల కోట్ల నిర్మాణ వ్యయంతో మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు చరిత్రలో నిలిచిపోతాయని, చారిత్రక వారసత్వ దేవాలయాల పరిరక్షణ కోసం, ధర్మరక్షణకునిగా ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. దివ్య కాశీ .. భవ్య కాశీ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రోజున వారణాసి కాశీలో సుందరీకరణ ,అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన మహోత్సవాలను పురస్కరించుకొని బిజెపి ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పాత బజార్ లో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నేడు కాశీ లో జరుగుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని భక్తులు వీక్షించే విధంగా శివాలయంలో టీవీ ని ఏర్పాటు చేశారు .

ఇట్టి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ కాశి విశ్వనాధ్ కారిడార్ పేరిట ప్రధాని నరేంద్ర మోడీ మొదటి దశలోదాదాపు 339 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కాశీ విశ్వనాధుని ఆలయం లోగడ మూడు వేల చదరపు అడుగులు మాత్రమే ఉంటే, దానిని ఐదు లక్షల చదరపు అడుగులకు విస్తరించారని తెలిపారు. ముఖ్యంగా ఆలయ విస్తరణకు ఎన్నో అవరోధాలు కలిగిన ఉత్తరప్రదేశ్లోని బిజెపి యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టుదలతో ఆలయ అభివృద్ధి పనులకు ముందుకు కొనసాగారని చెప్పారు. ప్రధానంగా ఆలయ విస్తరణలో భాగంగా చుట్టు పక్కల ఉన్న దాదాపు 300 మంది వ్యాపారులు నిరాశ్రయులు అయ్యారని , వారందరికీ ప్రత్యేక స్థలాలు కేటాయించి,ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా నేడు తీర్చిదిద్దారని తెలిపారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ లో భాగంగా అనేక నూతన కట్టడాలు అద్భుతంగా నిర్మించారని, ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ముఖచిత్రాన్ని కూడా పూర్తిగా మార్చివేశారని తెలిపారు. చరిత్రపరంగా పంచభూతాలు, నాడీ కేంద్రాల ఆధారంగా కాశీ నిర్మించబడిందని, ఆలయ అభివృద్ధి పనుల్లో అనేక పురాతన ఆలయాలు బయటపడ్డాయని ఆయన వివరించారు.

శ్రీకాశీవిశ్వనాథ్ ఆలయ వరాండాలు కారిడార్ నిర్మాణం , వారణాసి
అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అపురూపమైన ఆకృతులతో నాణ్యతతో, ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులు విశ్వేశ్వరుని దర్శించేందుకు వీలుగా నిర్మాణాలు చేశారని తెలిపారు. అంతేకాకుండా బనారస్ రైల్వే స్టేషన్, విమానాశ్రయం, క్యాన్సర్ ఆస్పత్రి, రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్, రో రో సేవ , గంగా ప్రక్షాళన అన్ని కాశీ కారిడార్లో భాగమేనని చెప్పారు. దేశాన్ని పరిపాలించిన దశాబ్దాలు పాలించిన పార్టీలు ధర్మాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించాయని, ధర్మరక్షణ విస్మరించాయన్నారు. మోడీ ప్రభుత్వ పనితీరుకు, చారిత్రక వారసత్వ సంపద, ధర్మ రక్షణ కు కాశి అభివృద్ధి పనులే నిదర్శనం అన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ , కన్వీనర్ దుబ్బాలశ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, ఈస్ట్ జోన్ అధ్యక్షులు అవ దుర్తి శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి మాసం గణేష్, వాణిజ్య సెల్ కన్వీనర్ శివానందం, ఈస్ట్ జోన్ ప్రతినిధులు నాయకులు ఉమశంకర్, మునిందర్, ఈసంపల్లి మహేశ్,పోరెడ్డి శ్రీధర్ , శరత్, సాగర్, సంతోష్, సారధి , నవీన్, ఈస్ట్ జోన్ కిసాన్ సెల్ అధ్యక్షులు మాచర్ల కోటేశ్వర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

also read:- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తథ్యం: