Telugu News

స్వామి వివేకానంద యువతకు మార్గదర్శి… ఆదర్శం..

ప్రముఖ న్యాయవాది సాయిని మల్లేశం..

0

స్వామి వివేకానంద యువతకు మార్గదర్శి… ఆదర్శం..

ప్రముఖ న్యాయవాది సాయిని మల్లేశం..

భరతమాత చల్లని ఒడిలో నవరత్న లాంటి ఎంతో మంది పుణ్య పురుషులు జన్మించారని, అలాంటి పుణ్య పురుషుల్లో స్వామి వివేకానంద ఒకరిని, స్వామి వివేకానంద జీవితం యువతకు మార్గదర్శి ఆదర్శం లాంటిదని ప్రముఖ న్యాయవాది సాయిని మల్లేశం తెలిపారు . స్వామి వివేకానంద జయంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనవరి 12 -1863 సంవత్సరంలో జన్మించిన మహానుభావుడు స్వామి వివేకానంద. దేశాన్ని పరిపాలించిన 250 ఏళ్లు పాలించిన ఆంగ్లేయులు, దేశ సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తూ, నాశనం చేసి దుష్ప్రచారం చేస్తున్న సమయంలో భారత సమాజాన్ని మేల్కొలపడానికి అవతరించిన పుణ్య పురుషుడు నరేంద్రుడని చెప్పారు.

also read :-పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించే గొప్ప నాయకుడు ఎంపీ నామ

ఆ నరేంద్ర డే అనతి కాలంలో రామకృష్ణ పరమహంస శారదా దేవి పాదాల వద్దకు చేరి ప్రపంచ మన్ననలను పొందిన హిందూ సన్యాసి మన స్వామి వివేకానంద అన్నారు. కేవలం 39 సంవత్సరాలు జీవించి భారతదేశ ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను, దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల వినువీధుల్లో ఎగరవేసి చాటి చెప్పిన పరాక్రమశాలి ధీరుడు స్వామి వివేకానంద అని చెప్పారు. భారతదేశాన్ని విదేశీ పాలన కబంధహస్తాల నుండి విముక్తి చేయడానికి ముందు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన దేశంలోని పేదరికం, బానిసత్వం, మూఢనమ్మకాలను చూసి చలించిపోయారు. ఆ స్థితిని చూసి చలించిపోయిన ఆయన వాటిని రూపుమాపడానికి అనేక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర కటోర తుల్యమైన మనుషుల్లా యువత స్వామి వివేకానంద ఆకాంక్షించారు . సర్వమత సభల కోసం స్వామి వివేకానంద1983 మే 31వ తేదీన బొంబాయి నుండి అమెరికాకు నౌకలో వెళ్లగా జులై నెలలో చేరుకున్నారని, అనంతరం ఆ సభలు మూడు నెలలు వాయిదా పడడంతో చికాగో నగరంలో ఉన్నారన్నారు.

also read :-ఘనంగా ఎంఎల్ఏ కందాళ జన్మదిన వేడుకలు : ఎం.పీ.పీ మంగిలాల్

ఆ సమయంలో చికాగో నగరంలో విధుల వెంట తిరిగినప్పుడు స్వామి వివేకానంద వేషధారణ చూసి అందరూ అసహ్యంగా చూసే వారన్నారు. అక్కడి వారు నువ్వు జెంటిల్ మెన్ గా లేవు అని స్వామి వివేకానంద తో అంటే, మీ దగ్గర టేలర్ జెంటిల్ మెన్ ను తయారు చేస్తారు, మా భారతదేశంలో పురుషులు జెంటిల్ మెన్ ను తయారు చేస్తారని బదులిచ్చారు. క్యాథరీక్ అనే మహిళ బోస్టన్ నగరంలో స్వామి వివేకానందకు ఆతిథ్యం ఇస్తుందని , ఆ సమయంలోనే జాన్ హేండ్రీ అనే ప్రొఫెసర్ తో పరిచయం ఏర్పడడంతో ప్రపంచ మహాసభలకు అనుమతి ఇప్పించమని స్వామి వివేకానంద ఉత్తరం రాయించుకున్నారు. ఆ ఉత్తరం సహాయంతో 11-9-1893 న జరిగిన ప్రపంచ మహాసభలకు పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. ప్రపంచ మహాసభల్లో స్వామి వివేకానంద మాట్లాడిన తీరు కు అక్కడి వారిని అందరిని మంత్రముగ్దుల్ని చేసిందన్నారు. ప్రపంచ మహాసభల్లో మాట్లాడిన తీరు కు అక్కడివారు నీరాజనం పట్టారని, హెరాల్డ్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు స్వామి వివేకానంద ఉపన్యాసాలు పతాక శీర్షికల్లో వార్తా కథనాలుగా ప్రచురించి, ఆయన్ను తుఫాను సన్యాసిగా వర్ణించాయన్నారు.

స్వామి వివేకానంద లాంటి వారు యుగానికి ఒక్కడు పుడతారని అక్కడి వారు కొనియాడారు. స్వామి వివేకానంద ఉపన్యాసాల అనంతరం భారతీయుల పట్ల విదేశీయుల ఆలోచన విధానం మారిందన్నారు. ప్రపంచ మహాసభల్లో చేసిన ఉపన్యాసాలతో స్వామి వివేకానంద భారత దేశ గౌరవం స్థాయిని మరింత పెంచారన్నారు. భారతదేశ ప్రజలను చైతన్య పరచడానికి అనేక కృషి చేసిన అనంతరం రామకృష్ణ మఠాన్ని స్థాపించారు.1902 జూలై 4న బేలూరు మఠం హౌరా లో స్వామి వివేకానంద తుది శ్వాస విడిచారు. స్వామి వివేకానంద సేవలను గుర్తింపుగా భారత ప్రభుత్వం 1984 లో ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించిందన్నారు.