నేడు కందుకూరి వీరేశలింగం
—-పంతులు జయంతి సందర్బంగా
(విజయం న్యూస్):-
బాల్యవివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, గొప్ప సంఘ సంస్కర్త. మూఢనమ్మకాలపై యుద్దం ప్రకటించిన కలియుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన 1848 ఏప్రిల్ 16 రాజమండ్రిలో జన్మించారు.
బాల్య వివాహాలు వద్దు ..
బ్రిటిష్ హయాంలో బాల్య వివాహాలు జరుగుతుండేవి. దీనిని నిరసిస్తూ ఆయన పెద్ద ఎత్తున ఉద్యమమే నిర్వహించారు. దీంతోపాటు అనేక సంఘ సంస్కరణలకు పాటు పడ్డారు. సామాజిక దురాచారాల నిర్మూలన కోసం నిరుపమానంగా కృషిచేశారు.
ఆధునికాంధ్ర పితామహుడు
సంఘసంస్కర్గా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వారు కందుకూరి. బాల్య వివాహాలు రద్దు కోసం ఉద్యమిస్తూనే .. వితంతు వివాహలు జరిపించాలని కోరేవాడు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపింది ఆయనే.
also read :-తండ్రి ఇచ్చిన చిట్టి డబ్బులు ఆన్లైన్ గేమ్ పోగొట్టినందుకు ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
సాహితీరంగంలో విశేష కృషి
సాహితీ వ్యాసంగంలోనూ విశేషంగా కృషిచేశారు కందుకూరి వీరేశలింగం పంతులు. బహుముఖ ప్రజాశాలి అయిన కందుకూరి .. మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను కూడా ప్రారంభించారు. తెలుగులో తొలి నవల వ్రాసింది.. మొదటి స్వీయ చరిత్ర రాసింది కూడా ఆయనే. అంతేగాక తొలి ప్రహసనం కూడా కందుకూరి చేతినుంచి జాలువారింది. కందుకూరి జయంతిని నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు.