అమెరికాలో ఘోర ప్రమాదం
== అకాశంలో విన్యాసాలు చేస్తుండగా రెండు విమానాలు ఢీ
== ఆరుగురు మ్రుతి
(న్యూఢిల్లీ- విజయంన్యూస్)
అమెరికా దేశంలోని ప్లోరెడా రాష్ట్రంలో అనుకోకుండా ఘోరప్రమాదం జరిగింది.. ఆకాశంలో విమానాలు విన్యాసాలు చేస్తుండగా రెండు విమానాలు పొరపాటున ఢీ కొన్నాయి. దీంతో ఆరుగురికి అక్కడిక్కడే చనిపోయినట్లు ఎయిర్ అధికారులు చెబుతున్నారు. ఈ ఘోర ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున అంటే అక్కడ మద్యాహ్నం సమయంలో జరిగింది. ఓ విమానం గాల్లోనే పేలిపోగా.. మరో విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ లో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో జరిగిందీ దారుణం.. ఈ ప్రమాదంలో విమానాలను నడుపుతున్న పైలట్లతో సహా ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో ఒక విమానం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానం కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
వైమానిక ప్రదర్శనలో పాల్గొన్న బోయింగ్ బి-17 యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా విమానం రెండూ ఆకాశంలో విన్యాసాలు ప్రారంభించాయి. వైమానిక ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను తమ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారు. ఇంతలో బోయింగ్ బీ-17 విమానం వైపు వేగంగా దూసుకొచ్చిన కింగ్ కోబ్రా క్షణాలలో దానిని ఢీ కొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం, ఆపై కింగ్ కోబ్రా విమానం పేలిపోయింది. బోయింగ్ విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ దుర్ఘటన మొత్తం సందర్శకుల ఫోన్లలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ప్రమాదానికి గురైన ఆ రెండు విమానాల పైలట్ల పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
దోపిడిదారుల మూఠాకు నాయకుడు నరేంద్రమోడీ : కూనంనేని సాంబశివరావు