Telugu News

గ్రామ గ్రామాన ఎర్రజెండా రెపరెపలు,

వాజేడు మే 01 విజయం న్యూస్)

0

గ్రామ గ్రామాన ఎర్రజెండా రెపరెపలు,

(వాజేడు మే 01 విజయం న్యూస్):-

మండలం లో ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే వేడుకలను మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో జరిగిన మేడే వేడుకల్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దబ్బకట్ల లక్ష్మయ్య మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో లక్షల మంది కార్మికుల ప్రాణ త్యాగాల నుండి పుట్టిందే ఎర్ర జెండా అని, ఈ పోరాటం వలన పెట్టుబడిదారులు, కార్మికులకు మధ్య జరిగిన ఒప్పందంలో 12 గంటల నుండి 8 గంటల పని వేళలు కుదింపు జరిగిందని, కుదించిన పని వేళలు అమలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్నారు.

also read :-కాంగ్రెస్ పార్టీ, ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో ఘనంగా మే డే కార్యక్రమం..

కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మేడే స్ఫూర్తిని తీసుకొని రాబోయే తరాలలో కార్మిక పోరాటాల ద్వారా విజయం సాధించాలని కార్మికులకు, కర్షకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి, నాయకులు దామోదర్, కృష్ణ బాబు, రమాదేవి, సౌమ్య , సిఐటియు మండల అధ్యక్షురాలు శాంతకుమారి, దేవి, పిట్టల లక్ష్మి , శకుంతల, రామక్క, సందీప్, ప్రభాకర్, సీత తదితరులు పాల్గొన్నారు,