Telugu News

విశాఖ మణ్యంలో చలిపులి

== గజగజ వణుకుతున్న ఏజెన్సీ జనం

0

విశాఖ మణ్యంలో చలిపులి
== గజగజ వణుకుతున్న ఏజెన్సీ జనం
== కప్పేసిన మంచు..రోజంతా వణికిస్తున్న చలి
(విశాఖపట్టణం-విజయంన్యూస్)
విశాఖ మణ్యంను చలిపులి గజగజలాడిస్తోంది. మన్యాన్ని మంచుదుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మేసింది. చింతపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు మొదల య్యాయి. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. శీతలగాలులు వీస్తుండడం, మంచు దట్టంగా కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణికిపోతున్నారు. శుక్రవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

also read :-ముంబైలో ఘోర అగ్నిప్రమాదం

సాధారణంగా ఏజెన్సీలో డిసెంబరు నుంచి జనవరి రెండో వారం వరకు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదవు తుంటాయి. కానీ ఈసారి జనవరి మూడో వారం దాటుతున్నా చలి తీవ్రత తగ్గకపోగా మరింత పెరిగింది. సంక్రాంతి తరువాత కనిష్ఠ ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువ నమోదు కావడం చాలా అరుదని ఏడీఆర్‌ తెలిపారు. ఇకపోతే విశాఖను దట్టమైన పొగమంచు ఆవరించింది. పొగమంచులో ప్రయాణీకులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో… పలు విమానాలను దారి మళ్లించినట్లు, మరికొన్ని విమానాలను అధికారులు రద్దు చేసినట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచారు. ఉదయం 9 గంటల తర్వాత విమాన రాకపోకలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.