Telugu News

లోక్ సభలో అన్ని ప్రశ్నలకు సామాధానమిస్తాం : ప్రధాని

** సభను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహాకరించాలి.

0

లోక్ సభలో అన్ని ప్రశ్నలకు సామాధానమిస్తాం : ప్రధాని.

** సభను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహాకరించాలి.
** విలేకర్లతో ప్రధాని నరేంద్ర మోడీ.

దిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుంచి జరగబోయే సమావేశాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు.

‘ఈ పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఎంతో ముఖ్యమైనవి. ఉభయ సభలు ఆటంకం లేకుండా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సమావేశాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం పార్లమెంటులో చర్చించి, అన్ని ప్రక్రియలు సజావుగా కొనసాగేలా చూడాలి. అలాగే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరుణంలో మనమంతా అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ నిర్వహిస్తున్నామని, స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కలల సాకారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో ప్రజలు తమ వంతు సహకారం అందిస్తున్నారని వెల్లడించారు.

నేటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో సుమారు 26 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. వాటిలో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును మొదటి రోజే ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. మరోవైపు పలు అంశాలపై విపక్షాలు తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యాయి.

also read :- నేడు మంత్రివర్గ సమావేశం..