Telugu News

మహిళ బిల్లు సంగతేంటి..?

 ఊకదంపుడు ఉపన్యాసాలేనా..?

0

 ఊకదంపుడు ఉపన్యాసాలేనా..?

==మహిళ బిల్లు సంగతేంటి..?

== చిన్న దేశాల్లో సైతం మహిళలకు పెద్దపీట

==  మనం నేర్చుకన్నదేంటి..?

== ప్రభుత్వాల పనితీరుకు ఇదేనా అర్థం

న్యూఢల్లీ,మార్చి10(విజయంన్యూస్):

మహిళలంటే గౌరవం.. మహిళలకు రిజర్వేషన్.. మహిళలోకానికి మేమేం నాంధీ అని చెప్పుకుంటున్న కొన్ని పార్టీలకు ఈ వార్త నిజంగా కనువిప్పు కవాలని కోరుకుందాం.. మహిళల సమస్యలపై బిజెపి ఊకదంపుడు ఉపన్యాసాలే  తప్ప చిత్తశుద్ద ఇకానరావడం లేదు. ఛాందస వాద సిద్దాంతాలను అనుసరించే దేశాల్లో కూడా చట్టసభల్లో మహిళల శాతం మన దేశంలో కన్నా మెరుగ్గా ఉన్నది. బంగ్లాదేశ్‌, నేపాల్‌ లాంటి చిన్న దేశాలు స్త్రీ, పురుష సమానత్వంలో మనకంటే ముందున్నాయి. పాక్‌ జాతీయ అసెంబ్లీలో 17 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేసింది. భారత్‌ లో మహిళా ఎంపీల వాటా లోక్‌సభలో 14.4 శాతం, రాజ్యసభ లో 11.2 శాతంగా ఉన్నది. ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, నేపాల్‌ వంటి దేశాలు.. అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు 50 శాతం టికెట్లను రిజర్వ్‌ చేయాలనిచట్టాలు చేశాయి.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సమావేశం ముఖ్యాంశాలు ఇవే

అయితే దక్షిణాఫ్రికాలోని రాజకీయపార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారానే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.  ఆఫ్రికా ప్రాంతాల్లో జాతీయ పార్లమెంట్‌లో ప్రపంచ సగటు 26.2 శాతం కన్నా ఎక్కువే మహిళలు ఎంపీలుగా ఉన్నారు. నేపాల్‌లో 34, బంగ్లాదేశ్‌ 21, పాకిస్థాన్‌ 20, భూటాన్‌ 17 శాతంతో మన దేశం కన్నా మెరుగ్గా ఉన్నాయి. ఆసియా దేశాల్లో 19.2 శాతం, అరబ్‌ దేశాల్లో 18.4 శాతం, పసిఫిక్‌ దేశాల్లో 13.5 శాతంగా ఉన్నది. మన దేశంలో 10 నుంచి 15 శాతం లోపు మహిళా ఎంపీలు న్నారు. ప్రపంచం మొత్తవ్మిూద రెండు దేశాల్లో మాత్రమే పార్లమెంట్లో 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. 2016 జూన్‌ గణాంకాల ప్రకారం రువాండా దేశంలో 63.8 శాతం, బోలివియాలో 53.1 శాతం ఉండగా, 30 శాతం కంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం గల దేశాల సంఖ్య పెరిగింది. 2008లో లోక్‌సభలో మహిళా రిజర్వే షన్ల కోసం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వ్యతిరేకించిన వారు దీనినే ప్రధాన అంశంగా తీసుకొచ్చారు. రిజర్వేషన్‌తో మహిళల పరిస్థితి మారదని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను వ్యతిరేకించిన వారు రిజర్వేషన్‌లో రొటేషన్‌ విధానాన్ని అనుసరిస్తే.. ఇప్పటికే ఎంపికైన పురుష ఎంపీలు తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేరు కాబట్టి నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే అవకాశాలు తగ్గుతాయని, తద్వారా మహిళలు స్వశక్తితో ఎదుగుతారని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: బీఆర్ఎస్ పాలనలోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌.: మంత్రి పువ్వాడ