Telugu News

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

** 24 గంటల్లో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు

0

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
** 24 గంటల్లో భారీగా పెరిగిన కోవిడ్ కేసులు
** దేశవ్యాప్తంగా 2,82,970 కేసులు నమోదుకాగా 441 మంది మ్రుతి
** టెస్టుల సంఖ్య పెంచాలని రాష్టాల్రకు కేంద్రం ఆదేశాలు
(న్యూఢల్లీ-విజయంన్యూస్)
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసులు రెండు లక్షలకంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్‌ దాటి రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోవైపు మళ్లీ బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సందర్భంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని తాజాగా కేంద్రం రాష్టాల్రను ఆదేశించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

also read :-ప్రజలందరు స్వీయ రక్షణ పాటించాలి

వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్టాల్రకు సూచించింది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్‌ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు.. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు.. రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కాగా.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా నిన్న 2,82,970 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 441 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారంతో పోల్చుకుంటే.. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 44,889 కేసులు, 131 మరణాలు పెరిగాయి.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 15,13 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశంలో 18,31,000 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 1,88,157 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,55,136,039 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 8,961 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చుకుంటే.. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 0.79 శాతం పెరిగింది. దేశంలో వ్యాక్సినేషన్‌ పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 158.50 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 76.35 లక్షల డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.

also read :-ఎమ్మెల్యే శంకర్ నాయక్ కె కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ నమోదు కాని కేసులు థర్డ్‌వేవ్‌లో నమోదవుతున్నాయి. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవు తున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సైతం విస్తరిస్తోంది. దీంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భయాందోళనల మధ్య గతేడాది సెకండ్‌ వేవ్‌లో వణుకుపుట్టించిన బ్లాక్‌ ఫంగస్‌ మళ్ళీ పంజా విసిరడం ప్రారంభించింది. ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌తో ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్‌ ఫంగస్‌ అతని కన్ను, ముక్కుకు వ్యాపించినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా థర్డ్‌ వేవ్‌లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి.

ఈ వైరస్‌ బారిన పడినవ్యక్తికి షుగర్‌ కారణంగా బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని బ్లాక్‌ ఫంగస్‌ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు కాన్పూర్‌ జీఎస్‌వీఎమ్‌ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంజయ్‌ కలా తెలిపారు. ఇతను కాన్పూర్‌ లోని కాంట్‌ నివాసి అని తెలిపారు. సదరు వ్యక్తికి కరోనా సోకిందని.. ఆతర్వాత బ్లాక్‌ ఫంగస్‌ వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అతని మధుమేహం సమస్య ఉందని తెలిపారు. ప్రస్తుతం అతని చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ భారీగా సోకింది. ఫంగస్‌ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయిన విషయం విదితమే. మరోసారి కేసులు నమోదవుతుండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని, స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

also readఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి: ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి
ఐసీఎంఆర్‌ పోర్టల్‌ డేటా ప్రకారం అనేక రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షలు తగ్గినట్లు కనిపిస్తోందని కేంద్రం తెలిపింది. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో టెస్టుల పెంపుపై తక్షణమే దృష్టిసారించాలని సూచించింది. కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. టెస్టింగ్‌తో కొత్త క్లస్టర్‌లు, హాట్‌స్పాట్‌లను గుర్తించవచ్చు.
తద్వారా కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, క్వారంటైనింగ్‌, ఐసొలేషన్‌ తదితర నియంత్రణ చర్యలు తీసుకునేందుకు సులభం అవుతుంది. వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉన్నవారిని కాపాడే అవకాశం ఉంటుంది. లక్షణాలు ఉన్న వారిని, ఎట్‌ రిస్క్‌ కాంటాక్ట్‌లను తప్పనిసరిగా పరీక్షించాలని రాష్టాల్రకు సూచనలు చేసింది కేంద్రం.. దీంతో.. దేశవ్యాప్తంగా కోవిడ్‌ నిర్దారణ పరీక్షల సంఖ్య మరింత ఊపందు కోనుంది.. ఇప్పటికే భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండగా.. టెస్ట్‌ల సంఖ్య పెరిగితే.. కేసులు మరింత భారీగా నమోదు అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.