Telugu News

★ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా.

క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవం.

0

★ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా.
క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవం.

★ ఎమ్మెల్సీ కవితకు మంత్రి.
పువ్వాడ శుభాకాంక్షలు.

ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క‌ల్వకుంట్ల క‌విత ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కవితకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక గొప్ప వక్త, అన్ని రంగాలలో మంచి విషయ పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై ఎనలేని పోరాట స్వభావం ఉన్న నాయకురాలు కవిత అని మంత్రి కొనియాడారు. స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా కవిత ఎన్నికవడంతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు భరోసా వచ్చినట్లయిందన్నారు. అలాగే నిజామాబాద్‌ జిల్లాకి ఎంతో మేలు చేకూరుతుందన్నారు.

ఏకగ్రీవ ఎన్నిక.

నిజామాబాద్ స్థానానికి పోటీ చేసిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి శ్రీనివాస్ నామినేష‌న్‌ను ఎన్నిక‌ల అధికారులు తిర‌స్క‌రించారు. శ్రీనివాస్ అఫిడ‌విట్‌లో త‌ప్పులు ఉన్నాయ‌ని, ఈ క్ర‌మంలోనే నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. ఉమ్మడి నిజా‌మా‌బాద్‌ జిల్లా నుంచి కల్వ‌కుంట్ల కవిత మరో‌సారి బరి‌లోకి దిగిన విష‌యం తెలిసిందే. ఏడాది క్రితం ఇదే నియో‌జ‌క‌వర్గం నుంచి ఎమ్మె‌ల్సీగా అఖండ విజయం సాధిం‌చిన కవిత మరో‌సారి తిరిగి పోటీ చేశారు. కవిత తర‌ఫున నాలుగు సెట్ల నామి‌నే‌షన్ల‌ను దాఖ‌లు చేశారు. గత ఉప ఎన్ని‌కల అను‌భ‌వాన్ని దృష్టిలో పెట్టు‌కొని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని‌క‌లకు దూరంగా ఉండి‌పో‌యాయి. అభ్య‌ర్థుల కోసం ఇరు పార్టీలు వెదికిన‌ప్ప‌టికీ చివరి వరకు ఏ ఒక్కరూ పోటీ చేసేం‌దుకు ముందుకు రాక‌పో‌వ‌డంతో జాతీయ పార్టీలు చేతు‌లె‌త్తే‌శాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి శ్రీనివాస్ నామినేష‌న్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టికీ అది తిరస్క‌ర‌ణ‌కు గురైంది.

also read :- కళ్ళల్లో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.