Telugu News

★ ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం

★ మంత్రులు పువ్వాడ, ప్రశాంత్‌రెడ్డి,

0

★ ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణం

★ మంత్రులు పువ్వాడ, ప్రశాంత్‌రెడ్డి,
సహ పలువురి శుభాకాంక్షలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా తాతా మధుసూదన్ గురువారం పదవీ ప్రమాణం స్వీకరించారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ తన చాంబర్‌లో పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , ఎమ్మెల్యేలు, కూసుమంచి జడ్పిటిసి ఇంటూరు శేఖర్ బేబీ, కూసుమంచి ఎంపీపీ బానోతు శీను తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు