Telugu News

కరీంనగర్ లో మంత్రి కేటి ఆర్ కు ఘన స్వాగతం  

రూ.1030కోట్లతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి

0

కరీంనగర్ లో మంత్రి కేటి ఆర్ కు ఘన స్వాగతం  

** రూ.1030కోట్లతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి

** హాజరైన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి

(కరీంనగర్-విజయం న్యూస్);-

రాష్ట్ర పురపాలక , ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు కరీంనగర్ లో ఘన స్వాగతం లభించింది. రూ.1030 కోట్ల తో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిందుకు గురువారం కరీంనగర్ సమీపంలోని తిమ్మాపూర్ వద్ద ఘాన స్వగతం పలికారు. మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ ఎంఎల్ రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి , డెప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశనకర్ లు స్వాగతాం పలికారు .

also read;-బాధిత కుటుంబాన్నీ ఓదార్చిన కేటీఆర్

అక్కడి మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా అల్గునూర్ వంతెన వద్దకు చేరుకొని భగీరథ పైలాన్ ను ఆవిష్కరించారు. 410 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించారు. బైపాస్ మీదుగా మార్కెఫెడ్ మైదానం కు చేరుకొని మంత్రి గంగులతో కలసి 615 కోట్ల రూపాయలతో చేపట్టే అభివుద్ది పనుల శీలా పలకలను ఆవిష్కరించారు. వేలాదిగా  తరలివచ్చిన కార్యకర్తల మధ్య కరీంనగర్ కు మరిన్ని వరాలు కురిపించారు