అక్రమ వెంచర్లపై చర్యలు తప్పవు
== లేఆవుట్ అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్లు చేయోద్దు
== సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-
ముందస్తు లే అవుట్ అనుమతులు లేకుండా రిజిస్ట్రేన్లు చేయరాదని, అక్రమ వెంచర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం నూతన మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు, మండల పంచాయితీ అధికారులు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లతో లే అవుట్ అనుమతులపై మండలాల వారీగా నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్న్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలితో కలిసి కలెక్టర్ సమీక్షించారు.
also read :-పాఠశాల లో మద్యం సేవించిన ప్రదనో పాధ్యాయు లు, సర్పంచ్ భర్త.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టం నిబంధలను ఖచ్చితంగా పాటించాలని లే అవుట్ అనుమతులు లేకుండా నిర్మించే వెంచర్లపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని అనుమతులు పొందిన వెంచర్లు గ్రామ పంచాయితీకి కేటాయించిన గ్రీన్ బెల్ట్ స్థలాలను వెంటనే స్వాదీన పర్చుకొని కౌంపౌండ్ వాల్, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నర్సరీలు చేపట్టాలన్నారు. అనుమతులు పొందకుండా పలు లే అవుట్లలో టేకు, శ్రీగంథం చెట్ల ప్లాంటేషన్ చేయడం పట్ల డవలప్మెంట్ ఫీజు చెల్లించకుండా ఉండడంపై వెంటనే నివేదిక సమర్పించాలని సంబంధిత వెంచర్ల నుండి రికవరీ చేయాలని అన్నారు.
also read :-మేకప్ మెన్ గా ఆమిర్ ఖాన్..ఎవరికోసమో తెలుసా?
ల్యాండ్ కన్వర్షన్లకు సంబంధించి ప్రభుత్వానికి సమకూరే ఆదాయం పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై తీవ్రమైన చర్యలుంటాయన్నారు. మండల అధికారులు ప్రతిరోజు అటువంటి లే అవుట్లను సందర్శించి యజమానులతో పర్మిషనకు దరఖాస్తు చేయించాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని, స్పందించని వెంటర్లకు సంబంధించిన ప్రహరీలను ముఖ ద్వారాలను తొలగించాలని కలెక్టర్ అధకారులకు ఆదేశించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇంచార్జ్ జిల్లా పంచాయితీ అధికారి వి.వి.అప్పారావు, ఆర్.అండ్.బి ఎస్.ఇ లక్ష్మణ్, ఇర్రిగేషన్ ఎస్.ఇ రవికుమార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ రాము, జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంధ్రనాద్, సూర్యనారాయణ, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్ కమీషనర్లు వెంకటపతిరాజు, సుజాత, రమాదేవి, తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎం.పి.ఓలు తదితరుల సమావేశంలో పాల్గొన్నారు.