Telugu News

అక్రమార్కుల చౌకబియ్యిం దందా

పేదల బియ్యానికి పెద్దల ఎసరు

0

అక్రమార్కుల చౌకబియ్యిం దందా
== పేదల బియ్యానికి పెద్దల ఎసరు
(మహబూబ్‌నగర్‌ -విజయంన్యూస్)
ఉమ్మడి జిల్లాలో మాత్రం రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. సంబంధిత అధికారుల వైఫల్యం.. ఉదాసీనతతో పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం అక్రమార్కుల జేబులను నింపుతోంది. మరోవైపు బియ్యం అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలున్నాయని.. అందుకే వారి జోలికి వెళ్లేందుకు పౌరసరఫరాలు..రెవెన్యూ.. పోలీసు అధికారులూ సాహసించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లారీల్లో బియ్యాన్ని అక్రమంగా కర్ణాటక సరిహద్దు దాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నచిన్న గ్రామాల విూదుగారేషన్‌ బియ్యాన్నిఅక్రమంగా కర్ణాటకకు తరలిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.

also read;-ఓటమి పాపమెవరిది?

చాలా మంది లబ్దిదారులు రేషన్‌ బియ్యం తినడం లేదు. దీంతో ప్రతి నెలా బియ్యం మిగిలిపోతోంది. దీన్ని గ్రహించిన కొంతమంది డీలర్లు వారిని కలిసి బియ్యం తీసుకున్నట్లు వేలిముద్ర వేయాలని అందుకు కిలో బియ్యానికి రూ.8 నుంచి రూ.10 చొప్పున ఇస్తామని మాట్లాడుకుంటున్నారు. గోదాముల్లో దాచి పెట్టుకుని వాటిని రైస్‌మిల్లర్లు, దళారులకు కిలోకు రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. షాపుల్లో ఉండాల్సిన బియ్యం కంటే ఎక్కువగా ఉండడంతో అధికారులు ఆయా డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నారు.

also read;-పంజాబ్‌లో స్పష్టమైన ఆధిక్యంలో ఆమ్‌ ఆద్మీ

ఉమ్మడి జిల్లా అధికారులకు తెలియకుండానే హైదరాబాద్‌కు చెందిన పౌరసరఫరాల అధికారులు దాడులు నిర్వహించి కేసులు వేలాది క్వింటాళ్ల బియ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలనే డిమాండ్‌ బలంగా ఉంది. బియ్యం అక్రమ రవాణాలో గద్వాల కింగ్‌గా పేరొందిన ఓ మిల్లర్‌ విషయంలో అధికారులు ఏవిూ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మల్దకల్‌ నుంచి బీజ్వరం, పెంచికల్‌పాడు, రాయపురం, చింతకుంట విూదుగా కర్ణాటకలోని ఉండ్రాలు దొడ్డికు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.