Telugu News

అజాతశత్రువు రవిచంద్రుడు

== ఇవ్వడం తప్ప అడగడం తెలియని దానగుణవంతుడు

0

అజాతశత్రువు రవిచంద్రుడు

== ఇవ్వడం తప్ప అడగడం తెలియని దానగుణవంతుడు

== రాజకీయాలకు రాకముందే సేవా కార్యక్రమాలు

== ఊరూరీనా ఆయన సేవలు

== ఎదిగే కొద్ది ఒదిగిన రవి

== పదవులను ఆశించిన రాకపోతే నైరాశ పడని నాయకుడు

== తెలంగాణ సర్కార్ నుంచి రాజ్యసభకు పయనమైన గాయత్రి రవి

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-

ఆయన ఆందరివాడు… వ్యాపారవేత్తగా.. సామాజిక సేవకుడిగా అందరికీ సుపరిచతమైన గాయత్రి రవి రాజకీయాల్లోనూ, అన్నింటిన అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అన్ని రాజకీయ పక్షాలతోనూ ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తారు. అనేక సందర్భాల్లో పలు రాజకీయ పార్టీలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరినా, నొప్పించక, తానొవ్వక.. అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పటికి ఆయన ఇటు తెలంగాణ, అలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటి, ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారంటే అది ఆయన రాజకీయ పరిణీతికి, స్నేహభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. వ్యాపార జీవితంలో అనేక ఆటుపోట్లను చవిచూసినా, ఎక్కడా తొనక లేదు, బెణక లేదు.. తన వ్యక్తిత్వంతోనే ప్రత్యర్థులకు సమాధానం చెప్పారు.

also read :-21 నుంచి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలి

తనకు నష్టం చేకూర్చే వాళ్ళను సైతం చిరునవ్వుతో దగ్గరికి తీసుకోవడం ఆయన బలం, బలహీనత. విలువలతో కూడిన మానవ సంబంధాలను నెరిపే స్వభావం ఉన్న గాయత్రి రవి ఎదిగిన కొద్ది… ఒదిగి ఉండటం అలవర్చుకున్నారు. తన పలుకుపడి.. పరపతిని ఏనాడూ దుర్వినియోగం చేయని తత్వం ఆయనది. అందుకే ఆయన నమ్మిన సిద్దాంతాన్ని, పెద్దలపై గౌరవాన్ని, ఒపిక తత్వాన్ని అలవర్చుకున్నారు. అందుకేనేమో అత్యున్నత పదవి ఆయన్ను వరించింది. రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన గాయత్రి రవి పై ‘విజయం’ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం.

also read :-దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం: ఎంపీ నామ

మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో అతి సామాన్య కుటుంబమైన వద్దిరాజు నారాయణ, వెంకటనర్సమ్మకు మూడో సంతానంగా జన్మించిన రవిచంద్ర అందరివాడిగా మారారు. కులమతబేదాలను చూడకుండా అందరికి సహాయం చేస్తూ సేవాగుణవంతుడైయ్యారు. చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నగ్రామంలో జన్మించిన ఆయన, మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు నడయాడి గడ్డలో ఆయన విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో చదువుకుని, తెలుగు సాహితీమూర్తులైన ఒద్దిరాజు సోదరులు తేజోమూర్తుల చైతన్యాన్ని పునికి పుచ్చుకుని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. అక్క, అన్నలు, తమ్ముళ్ళ ఆప్యాయతానుబంధాల నడుమ ఒద్దికగా ఎదిగిన రవిచంద్ర చిన్ననాటి నుండే కుటుంబ వ్యవహారాలకు చేదోడు వాదోడుగా నిలిచారు.

also read :-ముత్తారం సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న మహిళ సర్పంచ్ భర్త.

1969లో తండ్రి వెంకటనర్సయ్య స్థాపించిన రైస్ మిల్ నిర్వహణ బా

ధ్యతలను తన 12వ యేటనే భుజాలకెత్తుకుని వ్యాపార మెళకువలు నేర్చుకున్న రవి, ఆ తరువాత గ్రానైట్ రంగంలో దిగి పలు క్వారీ, గ్రానైట్ పరిశ్రమలను స్థాపించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత గ్రానైట్ రంగంలోకి దిగి పలు క్వారీ, గ్రానైట్ పరిశ్రమలను స్థాపించి అంతర్జాతీయ స్థాయి ఎగుమతులతో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఫలితంగానే గ్రానైట్ రంగంలో రవిచంద్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి జాడ చూపారు…. చూపుతున్నారు. తనతో పాటు మిగతా ఐదుగురు సోదరులను కూడా ఇదే రంగంలో స్థిరపడేలా చేయడంలో ఈయనది విశేషమైన కృషి.
== కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా
గ్రానైట్ వ్యాపార రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతులతో ప్రముఖ స్థాయికి ఎదిగిన గాయత్రి రవి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా కొనసాగుతూ వస్తున్నాడు. డిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ముఖ్యమైన నాయకులతో సన్నిహిత సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్, కొప్పుల రాజు, ఆర్.సి. కుంతియాలతో పాటు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా అనేకమంది టిపిసిసి అగ్రశ్రేణి నాయకులతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటారు. 2009, 2014లోనే ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి, 2018లో వరంగల్ జిల్లాలో పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన గాయత్రి రవి అనేక పదవులను ఆశించినప్పటికి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి విదేయుడుగా ఉన్నారు.

also read :-నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పాత నేరస్తుడు పరారీ 
== ఇవ్వడమే తప్ప… అడగడం తెలియని వ్యక్తి
గాయత్రి రవికి మొదటి నుంచి సేవాగుణమే. ఇవ్వడమే కానీ అడగడం తెలియని వ్యక్తి. తను నలుగురికి సాయపడుతూ… సమాజాన్నే కుటుంబంగా భావించారు. సేవ చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చడం, గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి చూపడం, గ్రామాల్లో దేవాలయాల నిర్మాణానికి, దేవతలు, జాతరలు, ఉత్సవాలు, ఉర్సు వేడుకలు, సెమీ క్రిస్మస్ పండుగలు జరిగే ప్రతిచోటా ప్రజా సౌకర్యార్థం తనవంతు సాయం చేశారు. ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకుల కోసం ప్రజలు ఎదురు చూడకుండా అన్నీ తానై జనంలో ఒకడై, సామాజిక బాధ్యతను తన బుజాలకెత్తు కోవడంలో రవిచంద్ర ముందున్నారు. అధికారం, యంత్రాంగం చేతిలో లేకపోయినా ప్రజలకు స్వంత డబ్బుతో సేవ చేస్తూ వచ్చారు.
== తెలంగాణ కుంభమేళాలో తాను సైతం…
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతి యేడు నేను సైతం అంటూ… స్వంత డబ్బులు వెచ్చించి జాతర పనుల్లో గాయత్రి రవి భాగస్వాములవుతున్నారు. 2016లో జరిగిన జాతరకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బహుముఖ ఏర్పాట్లు చేపట్టింది. దీంతో రవిచంద్ర రూ.3.5 కోట్లు వెచ్చించి అమ్మవార్ల గద్దెలు, క్యూలైన్లకు గ్రానైట్ రాళ్ళు, స్టీల్ రెయిలింగ్’ ఆధునీకరించారు. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్., డిప్యూటీ సి.ఎం. కడియం శ్రీహరి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిల నుంచి రవి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. 2018లో జరిగిన జాతరలో కూడా సమారు రూ.20 లక్షలు వెచ్చించి మేడారంలో పనులు చేయించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో శ్రీశ్రీశ్రీ విజయ శంకర బాల కనకదుర్గాదేవి శివ పంచాయతన క్షేత్రంను స్వంత నిధులతో నిర్మించారు.

also read :-ప్రమాదాల నివారణకు పోలీసుల ముందస్తు చర్యలు

కేరళలోని అయ్యప్పస్వామి దేవస్థానంలోని పరకామణిలో గ్రానైట్ రాళ్ళు వేయించి, పొరుగు రాష్ట్రంలోనూ తన దాతృత్వం చాటుకున్నారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నదాన సత్రం, ఖమ్మం నగరం గాంధీ చౌక్ షిర్డీసాయిబాబా మందిరంలో బాబా విగ్రహానికి బంగారు కిరీటాన్ని బహుకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవాలయాలకు సహాయం చేశారు. అంతేకాకుండా హిందు దేవాలయాలే కాకుండా చర్చిలు, మసీదులకు కూడా ఆయన అర్థిక సహాయం అందించారు. గుడులే కాదు బడుల నిర్మాణానికి సహాయం చేసిన సేవగుణవంతుడు ఆయన.

== అడిగిన వారికి అన్నం పెట్టే దాతృత్యం
ఆకలిలో ఉన్న వారికి అన్నదానం చేయడం కూడా తెలిసిన తాత్వికుడు గాయత్రి రవి తమ ఇంటికి ఎవరు వచ్చినా.. కడుపునిండా అన్నం పెట్టి పంపే తన తల్లి వెంకటనర్సమ్మను స్పూర్తిగా తీసుకుని అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తుంటారు. అయ్యప్ప భక్తమండలకి భారీ విరాళాన్ని అందించి అయ్యప్ప భక్తుల అభిమానాన్ని చూరగొన్నారు. అంతేకాదు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నగరంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చిన వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులకు సైతం కాదనకుండా సాయం చేసి అన్నదాన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. తన స్వగ్రామం ఇనుగుర్తి, కే సుముద్రం, మహబూబాబాద్లలో సైతం అయ్యప్ప దీక్షాపరులకు, వినాయక మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహించారు.

==తలసేమియా చిన్నారుల కోసం

తలసేమియా చిన్నారుల గుండెల్లో చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్న తలసేమియా వ్యాధిపై ఖమ్మంలోని ఓ స్వచ్చంధ సంస్థపోరాడుతోంది. ప్రతి 15 రోజులకొకసారి కొత్త రక్తం ఎక్కించుకోలేని నిరుపేద చిన్నారుల భవిష్యత్ అంధకారమయం కాకూడదనే లక్ష్యంతో సంస్థకు భారీ విరాళం అందజేశారు గాయత్రి రవి. తను ఎంచుకున్న సామాజిక సేవా బాటలోనే గాయత్రి రవి అనుచరులు పయనిస్తున్నారు. ఇటీవల రవిచంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 108 యూనిట్ల రక్తాన్ని సేకరించి గాయత్రి రవి పరంపరను కొనసాగించారు.

== క్రీడలకు వెన్నుదన్ను స్వతహాగా క్రీడాకారుడైన

గాయత్రి రవికి క్రీడలన్నా… క్రీడాకారులన్నా.. ఎనలేని మక్కువ. అందుకే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎవరు ఆర్థిక సాయం కోరినా.. కాదనకుండా క్రీడా సంఘాలు, నిర్వాహకులను సంతృప్తి పర్చి పంపిస్తుంటారు. తన స్వగ్రామం ఇనుగుర్తి నుండి మొదలుకొని కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌లలో అనేకమార్లు జూడో, కరాటే, కబడ్డీ, వాలీబాల్, షటిల్, క్యారమ్స్, క్రికెట్ పోలీసు నిర్వహించారు. సుమన్ షోటోకాన్ కరాటే స్పోర్ట్స్ అకాడమీకి
జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రవిచంద్ర ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఖమ్మం, హైదరాబాద్లో జాతీయస్థాయి కరాటే పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. అదే క్రమంలో జూడో అసోసియేషను సైతం గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతూ 4 సార్లు జూడో పోటీల నిర్వహణకు ఆర్ధిక వితరణ చేశారు.

== గ్రానైట్ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ…

గ్రానైట్ పరిశ్రమను నిత్యం ఏవో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా సమస్యలు ఎదురైనప్పుడల్లా వాటి పరిష్కారానికి పరిశ్రమల యాజమానులు ఉద్యమ బాట పడుతుంటారు. ఆ ఉద్యమాలకు ఒకపక్క సంఘీభావం తెలుపుతూనే…. మరోప్రక్క వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేయడంలో గాయత్రి రవి ఎప్పుడూ ముందుంటారు. గతంలో పరిశ్రమలకు విధించిన విద్యుత్ కోతలు, హాలిడేలు, ఇతర పన్నులు, బకాయీల సమస్యల విషయంలో గానీ, తాజాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరుతో విధించిన పన్ను భారాలపై… జరిగిన ప్రతి ఆందోళన సమయంలో గ్రానైట్ పరిశ్రమ యజమానులకు అండగా నిలబడ్డారు.

also read :-నిస్సారమవుతున్న భూమిని రక్షించండి*

కేంద్రం జిఎస్టీ పేరుతో గ్రానైట్‌పై ఏకంగా 28 శాతం పన్ను విధించడంతో వ్యాపారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. చిన్న తరహా పరిశ్రమగా ఉన్న గ్రానైట్ పై అంత భారం సరికాదంటూ ఉద్యమ బాట పట్టారు. డిల్లీలో, ఖమ్మంలో ధర్నాలు, ఆమరణ దీక్షలు చేపట్టారు. ఆ సమయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇతర కేబినెట్ మంత్రులు, పలు రాజకీయ పార్టీల ప్రముఖ నేతలను కలిసి గ్రానైట్ పరిశ్రమపై జీఎస్టీ భారం లేకుండా చూడాలని అందరి మద్దతు కూడగట్టడంలో గాయత్రి రవి సఫలీకృతం అయ్యారు.