పేదల అభ్యున్నతికి అంబేడ్కర్ రాజ్యాంగమే మూలం
– మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
– ఉప్పలపాడులో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
(బయ్యారం:విజయం న్యూస్ ):-
నిరుపేదల అభ్యున్నతికి అంబేడ్కర్ రాజ్యాంగమే మూలమని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బయ్యారం మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప్పలపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు పేదల దరిచేరుతున్నాయంటే దానికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగమే ముఖ్య కారణామన్నారు. దేశం గర్వించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతమైన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు.
also read :-ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పొంగులేటి
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఉప్పలపాడు గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మహబూబాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, సొసైటీ ఛైర్మన్ మూల మధూకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ గుండా వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ జాటోతు ఝాన్సీలక్ష్మి, పీఎస్ఆర్ యూత్ సుమన్, ఎంపీపీ మూడు శివాజీ చౌహాన్, సొసైటీ ఛైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, కొండ్రు యల్లయ్య తదితరులు పాల్గొన్నారు.