Telugu News

మా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుకి దక్కిన అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి తెలంగాణ బిడ్డ

0

మా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుకి దక్కిన అరుదైన గౌరవం

 

ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి తెలంగాణ బిడ్డ

 

(తుర్కపల్లి  విజయం న్యూస్):-

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని తెలంగాణ బిడ్డే.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురు రజని మంత్రి కావటంపై ఆ గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

also read :-సమాజ బాగుకై యువత రాజకీయాల్లోకి రావాలి

సత్తయ బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు.

ఇతనికి ఇద్దరు కూతుళ్లు , కొడుకు ఉన్నారు.

రెండో కూతురు రజని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తతో వివాహమైంది.

ఆమె పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.