కూసుమంచిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
(కూసుమంచి-విజయంన్యూస్);-
కూసుమంచి మండల కేంద్రంలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంఫ్ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు వేముల వీరయ్య ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతన్న పై కక్ష గట్టి తెలంగాణ రైతాంగంపై వివక్ష చూపిస్తున్న కారణంగా తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ మూడు వేల కోట్లతో యాసంగి లో పండించిన వడ్లు కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ప్రకటించడంతో టీఆర్ఎస్ కూసుమంచి నాయకులు, రైతాంగం ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
also read :-పొంగులేటి మరో సంచలన ప్రకటన
హర్షాతిరేకాలు ప్రకటిస్తూ కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు వేముల వీరయ్య, మహమ్మద్ ఆసిఫ్ పాషా, డిసిసిబి డైరెక్టర్ శేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లిడి అరుణ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు జర్పుల బాలాజీనాయక్ ,ఊడుగు జ్యోతి వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, భూక్య స్వాతి హరి నాయక్, సర్పంచులు బానోత్ కిషన్ నాయక్, బానోత్ నాగేశ్వరరావు, ఆంజనేయులు, కన్నెబోయిన కౌసల్య లింగయ్య, రాయబారపు స్వాతి రమేష్ , వాసంశెట్టి వెంకన్న మమత ఉపేందర్,యూత్ అధ్యక్షుడు తంగెళ్ల బుచ్చిబాబు, సోషల్ మీడియా అధ్యక్ష కార్యదర్శు వడిత్య బాలకృష్ణ, పల్లె బోయిన శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు తిప్పని అలివేలమ్మ,
కూసుమంచి గ్రామ శాఖ అధ్యక్షులు కొక్కిరేణి సీతారాములు,వడ్త్యా రామూర్తి, నారాయణ, కొమ్ము వెంకటేశ్వర్లు కొండపల్లి వెంకటేశ్వర్లు రైతుబంధు సమితి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కూసుమంచి మండల నాయకులు, పడిశాల గోపి , కట్ల నాగేశ్వరరావు, అర్వపల్లి ఉపేందర్, కనకం రామారావు, తాహెర్ హుస్సేన్,బానోత్ సీతారాములు, వడ్త్యా కిషన్, యాదగిరి నెమ్మని నాసరయ్య దొంగరి శ్రీనివాసరావు, కొండపల్లి సతీష్ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు