Telugu News

కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలి.

- నేడు నర్సంపేట పట్టణంలో నిర్వహించిన "దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 

0

కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలి.

 

– —నేడు నర్సంపేట పట్టణంలో నిర్వహించిన “దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 

 

– —సమ్మెలో పాల్గొన్న పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు..

 

—- రేపు అన్ని మండల కేంద్రాల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయండి…

 

(నర్సంపేట విజయం న్యూస్

– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక-ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ నేడు నర్సంపేట పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించిన “దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె” లో గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  పాల్గొనడం జరిగింది ..

also read :-శాస్రోక్తంగా ముగిసిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..

– మార్చి 28, 29 దేశవ్యాప్తంగా జరిగేటటువంటి కార్మిక సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలోని కార్మిక సంఘాలను అన్నింటినీ కలుపుకొని భారీ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
– కార్మికులందరూ ఐక్యంగా ఉండాలి.

– గతం నుండి వచ్చిన హక్కులను కాల రాసె ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి పూర్తిగా నశించాలని మేము డిమాండ్ చేయడం జరగింది.రేపు కూడా నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులచే నిర్వహించబడతాయి.

also read :-నిశ్చితార్ధ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి
– LIC, BSNL, రైల్వేశాఖ లను & అనేక రకాలైన గవర్నమెంట్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. దీని వలన అనేక మంది కార్మికులు ఉద్యోగాలు పోయి రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న లేబర్లకు కార్మిక శాఖ కల్పించిన హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తోంది.కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకుని మరియు కార్మిక వర్గ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాను.

 

ఈ సమ్మెలో జెడ్పి వైస్ చైర్మన్, నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, AITUC, CITU, TRSKV, AIFTU (new), AIUTU కార్మిక సంఘాల నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, అన్ని రంగాలకు చెందిన కార్మికులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.