ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా
== పీఆర్సీ 23.29 శాతం పెంచుతూ నిర్ణయం
== 2020 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని తెల్చి చెప్పిన సీఎం జగన్
== ఉద్యోగ విరమణ మరో రెండేళ్లు పెంచిన ఏపీ సర్కార్
== హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు..ఉద్యోగులు
(అమరావతి-విజయంన్యూస్)
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ ముందు మంచి ధమాకాను ప్రకటించింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23.29 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో రూ.10,267 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. 11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పీఆర్సీ ప్రకటించారు. జూన్ 30లోగా కారుణ్య నియమాకలను పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. స్వంత ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్న టౌన్ షిప్లో ఇళ్లు మంజూరు చేస్తామని హామినిచ్చారు. పెండింగ్ లో ఉన్న డీఏలో వచ్చే నెల జీతంతో కలిసి ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
allso read :- కీచక రాఘవ ఎక్కడ: రేవంత్ రెడ్డి