Telugu News

ఏపీలో మళ్లీ పీఆర్సీ లొల్లి

== నిరసనల దిశగా ఏపీ ఉద్యోగులు

0

ఏపీలో మళ్లీ పీఆర్సీ లొల్లి
== నిరసనల దిశగా ఏపీ ఉద్యోగులు
== రాష్ట్రప్రభుత్వ జీవోలతో ఉద్యోగుల్లో కలవరం
== హెచ్‌ఆర్‌ఎ 30 నుంచి 16 శాతానికి తగ్గింపు
== నేటినుంచి మళ్లీ నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు
(విజయవాడ-విజయంన్యూస్)
ఏపీలో పీఆర్సీ లొల్లి మళ్లీ మొదలైయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఇటీవలే పీఆర్సీని ఏపీ సర్కార్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగా, ఆ ప్రకటన ఏమి కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పట్ల ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. హెచ్ఆర్ఏ 30 నుంచి 16 శాతానికి తగ్గింపు పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల నూతన పీఆర్సీ జీవోలను సోమవారం రాత్రి ప్రభుత్వం విడుదల చేయగా అందులోని పలు అంశాలను ఉద్యోగులను కలవరపరిచాయి.

also read :-ఎన్టీఆర్‌ కు నివాళ్లు అర్పించిన బాలయ్య
ఈ పీఆర్సీ తమకు అక్కర్లేదని.. పాత పీఆర్సీనే కంటిన్యూ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఉద్యోగులకు ఇచ్చే హెచ్‌ఆర్‌ఏ తగ్గించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలను జీవోలలో పేర్కొన్నారని.. ఈ జీవోలను తాము తిరస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.

also read :-ఏపిలో కరోనా విలయతాండవం

ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు అందరూ బుధవారం 19వ తేదీనుంచి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతామన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక తమకు అవసరం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని ఇటీవల కాగ్‌ నివేదిక వెల్లడిరచిందని.. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి కూడా చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. పక్క రాష్ట్రం కంటే ఏపీకి ఒక రూపాయి ఆదాయం ఎక్కువే వస్తుందన్నారు. జీవోలన్నీ రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని అల్టీమేటం జారీ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను ఎత్తివేయడం దుర్మార్గమని మండిపడ్డాయి. ఇలాంటి పీఆర్సీని తన సర్వీస్‌లో ఇంతవరకు చూడలేదని ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు అన్నారు.

ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై స్పందించిన ఆయన కుడిచేత్తో ఇచ్చి ఎడం చేత్తో వసూలు చేస్తోందని విమర్శించారు. ఐఏఎస్‌లు రూ. 40 వేలు హెచ్‌ఆర్‌ఏ తీసుకొని.. తమకు తగ్గించాలని రిపోర్ట్‌ ఇస్తారా? అంటూ మండిపడ్డారు. తమకు ఈ పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీ, డిఏలను కొనసాగించాలని బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల భయాందోళనలే నిజమయ్యాయి. జగన్‌ ప్రభుత్వ ’రివర్స్‌ పీఆర్సీ’ ఖరారైపోయింది. ఇక… ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ సిబ్బంది పెన్షన్లు భారీగా తగ్గనున్నాయి. వేతన సవరణకు సంబంధించిన జీవోలు సోమవారం రాత్రి పొద్దుపోయాక విడుదలయ్యాయి. ఇప్పటికే ఐఆర్‌ 27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ (23.29 శాతం) ప్రకటించిన సర్కారు… ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, డీఏల్లోనూ ఉద్యోగులకు రaలక్‌ ఇచ్చింది. క్వాంటమ్‌ పెన్షన్లలోనూ ఒక శ్లాబు ఎత్తేసింది.

దీంతో పీఆర్సీతో పెరగాల్సిన ఉద్యోగుల వేతనాలు ’రివర్స్‌’ గేరు వేశాయని మండిపడ్డారు. జగన్‌ సర్కార్‌పై రివర్స్‌ పీఆర్సీ విషయంలో సచివాలయ ఉద్యోగులు దండెత్తారు. రివర్స్‌ పీఆర్సీపై సచివాలయ ఉద్యోగుల సంఘ నేతలను ఉద్యోగులు నిలదీశారు. ఈ క్రమంలో ఉద్యోగులతో కలసి ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి సీఎస్‌కు రిప్రసెంటేషన్‌ ఇచ్చేందుకు వెళ్లారు. రివర్స్‌ పీఆర్సీపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వందలాది మంది ఉద్యోగులు ర్యాలీగా సీఎస్‌ ఆఫీస్‌ వైపు కదిలారు. కాగా… ఒకటవ బ్లాక్‌ వద్ద ఉద్యోగులను భద్రతా సిబ్బంది అడ్డగించారు. కొంతమంది ఉద్యోగులను మాత్రమే సిబ్బంది లోనికి అనుమతించారు.