అసెంబ్లీలో అవి వాడోద్దంటా..? తెల్చిచెప్పిన స్పీకర్
== సారా మరణాలపై టిడిపి ఆందోళన
== సస్సెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటన
== సభలో సెల్‌ఫోన్లు, ప్లకార్డులపై నిషేధం
(అమరావతి-విజయంన్యూస్)
ఎపి శాసనసభ సమావేశాల్లో జంగారెడ్డిగూడెం సారా మరణాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టు వీడలేదు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వరుసగా స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి సభ్యులు ఆందోళన కొనసాగించారు. వరుసగా నాలుగోరోజు గురువారం కూడా అదేవిధంగా ప్రవర్తించిన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేసారు. సభ జరుగకుండా అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
also read;-పేదలకు అండగా భరోసా కేంద్రం
అసెంబ్లీ నుంచి వరుసగా మూడో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షకు గురయ్యారు. గురువారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి జే బ్రాండ్స్ మద్యం, నాటుసారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో చప్పట్లు కొడుతూ నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నా రంటూ అసెంబ్లీలో ఉన్న టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. నిన్న సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుఆర్డర్‌లో లేదని తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. అలాగే అసెంబ్లీలోకి సభ్యులు ఎవ్వరూ మొబైల్, ప్లాకార్డులు, రెచ్చగొట్టే ఇతర కార్యక్రమాలు చేపట్ట వద్దని రూల్ నెంబర్ 317లో చేర్చనున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
also read;-మణిరత్నం చిత్రంలో ఐశ్వర్య నటిస్తుందా..?
కాగా… స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పీకర్ రూలింగ్ ఇవ్వడంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో సమయంలో మూడు ప్రాంతాల అభివృద్ధిపై చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు కోరగా సభ ముగిసేలోగా విస్తృత స్థాయి ప్రత్యేక చర్చ చేపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సభలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఆర్యవైశ్యులపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. సొంత పార్టీలోని ఆర్యవైశ్య నేత శిద్దా రాఘవరావును అవమానించిన చరిత్ర చంద్రబాబుది అని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఆర్యవైశ్య ద్రోహులని, రోశయ్యను చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు పెట్టాడని పేర్కొన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఆరోపించారు.