కార్యదర్శిని సస్పెండ్ చేసే అధికారం అధ్యక్షునికి లేదు
రాజారావు వైఖరి మార్చుకోవాలని ముమ్మినేని అరవింద్ హితవు
కార్యదర్శిని సస్పెండ్ చేసే అధికారం అధ్యక్షునికి లేదు
– రాజారావు వైఖరి మార్చుకోవాలని ముమ్మినేని అరవింద్ హితవు
(భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్):-
టీఆర్ఎస్ చర్ల మండల కార్యదర్శి నక్కినబోయిన శ్రీనివాసయాదవ్‌తోపాటు 9 మందిని
పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా చర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సోయం రాజారావు చేసిన ప్రకటనపై కార్యదర్శి వర్గం భగ్గుమంది. సస్పెండ్ ప్రకటన సోషల్ మీడియాలో వెలువడిన కొద్ది క్షణాలలోనే కార్యదర్శి వర్గం నాయకులు ముమ్మినేని అరవింద్, తడికల లాలయ్య, పోట్రు బ్రహ్మనందరెడ్డి, ఇర్పా వసంత్, తోటమల్ల రవికుమార్ తదితరులు సమావేశమై తమ అభిప్రాయాన్ని వీడియో రూపంలో రిలీజ్ చేశారు. రాజారావు వెంటనే తన ప్రకటన వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది మండల కమిటీ నిర్ణయంకాదని, ముమ్మాటికీ రాజారావు ఏకపక్ష నిర్ణయం అన్నారు. మండలంలో బలంగా ఉన్న పార్టీని నాశనం చేసేందుకు రాజారావు కంకణం కట్టుకొని గ్రూపులు పెంచి పోషిస్తున్నారని అరవింద్ ఆరోపించారు
also read :-తాపీ మేస్త్రీల సంఘం భవన నిర్మాణానికి పొంగులేటి రూ.లక్ష విరాళం
సంఘటనపై అధ్యక్షుని హోదాలో రిపోర్టు రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుకి పంపిస్తే ఏమి జరిగిందనేది వాళ్ళు విచారించి తగు నిర్ణయం తీసుకుంటారని, అంతేతప్ప సోయం రాజారావుకి సస్పెండ్ చేసే అధికారం లేదన్నారు. అధ్యక్షునిగా సోయం రాజారావునే కార్యకర్తలు అంగీకరించడంలేదని, కాకపోతే పార్టీ మీద అభిమానంతో జిల్లా పెద్దల సూచన మేరకు రాజీపడి పనిచేస్తున్నారని అన్నారు. వాట్సప్‌లో వ్యక్తిగత పోస్టుపై ఫోన్‌లో పరస్పరం తిట్టుకొని గొడవపడితే పూర్తిగా విచారించకుండా పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని అరవింద్ ప్రశ్నించారు. ఒకవిధంగా అది వ్యక్తిగత గొడవ తప్ప, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజారావు ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, లేదంటే ఆయనకు సహకరించే వారు పార్టీలో ఎవరు ఉండరని అన్నారు.