అసెంబ్లీనా.. పబ్లిక్ మీటింగా..?: భట్టి విక్రమార్క
హరిష్‌రావు వ్యాక్యాలకు భట్టి కౌంటర్
ఇది అసెంబ్లీనా.. పబ్లిక్ మీటింగా..? హరీష్‌రావు బడ్జెట్ పద్దులపై మాట్లాడాల్సిన మంత్రి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికే గంట సమయం తీసుకున్నారు. ఇదేం పద్దతి అద్యక్షా… కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని తెలంగాణ వచ్చిన తరువాతనే మొత్తం అభివృద్ది చేశామని ఇలా అసెంబ్లీ వేదికగా అబద్దాలు చెబితే ఎట్లా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ పద్దుల చర్చల్లో కాంగ్రెస్‌పై మంత్రులు చేసిన వ్యాక్యాలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా..? మీరు నేను ఇక్కడ కూర్చోని మాట్లాడే వారమా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పైనే మీరు ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు.
also read;-2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం : పవన్ కల్యాణ్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏం ప్రాజెక్టులు కట్టలేదని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాక్యాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తిప్పికొట్టారు. ఎస్ఆర్ ఎస్‌పి , శ్రీపాదంపల్లి, దేవాదుల, నాగర్జున్‌సాగర్ తదితర ప్రాజెక్టులను నిర్మించి సాగు, తాగు నీరు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? ఇది నిజం కాదా? అని మంత్రి హరీష్‌రావును నిలదీశారు. కాళేశ్వర్‌రావు( హరీష్‌రావు) రాజీవ్‌సాగర్, ఇప్పుడు మీరు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పనులను ఎవరు ప్రారంభించారో తెలియదా అని మండిపడ్డారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ పాలకులు నాలుగు చోట్ల శంకుస్థాపనలు చేశారని మంత్రి హరీష్‌రావు చేసిన ఎద్దేవాకు అదే స్థాయిలో భట్టీ గట్టీగా కౌంటర్ ఇచ్చారు. హరీష్‌రావు ప్రాణహితను రీ డిజైన్ చేసి కాళేశ్వరం పేరు పెట్టి మీరు పది చోట్ల కొబ్బరికాయలు కొట్టలేదా? అని ప్రశ్నించారు. మేము నాలుగు చోట్ల కొబ్బరి కాయలు కడితే తప్పు అన్నట్లుగా మంత్రి వ్యాక్యాలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఒక్క ఎకరానికి అయినా సాగు నీరు ఇచ్చారా? ఇస్తే ఆదనపు ఆయకట్టు ఎంతో చూపించండి అంటూ సవాల్ చేశారు.
also read;-ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై (T or T)రేపు స్పష్టత ఇస్తాం : మంత్రి సబిత
కృష్ణా గెజిట్‌పై ఏం చేస్తున్నారు
కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి ఆరు నెలలు కావస్తుంటే.. ఏం చేస్తున్నారని హరీష్‌రావును సూటిగా ప్రశ్నించారు. కృష్ణా, గోదవరి నదులపై నిర్మిస్తున్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పరిస్తితి ఏంటీ అని నిలదీశారు. వీటికి అనుమతులు రాకుంటే అప్పులు తీసుకొచ్చి నిర్మిస్తున్నారు? ఈ అప్పు ఎవరు తీర్చాలి? దీనిపై మర సర్కార్ స్టాండ్ ఏంటని నిలదీశారు. నాగర్జున్‌సాగర్ జోన్ 3 ఆంద్ర పరిధిలో ఉన్న సాగు మండలాలను జోన్-2లోకి మార్చడానికి 8 సంవత్సరాలు అవుతున్న ఫైలు ముందుకు కదలకపోవడం విచారకరం అన్నారు. వెంటనే జోన్-3లో ఉన్న మండలాలను తెలంగాణ ప్రభుత్వం జోన్-2లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాలమూరు, ఖమ్మం, నల్లగొండ పరిధిలో ఉన్న కృష్ణా ప్రాజెక్టులు ఏడారిగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం వెంటనే మేల్కోని సంగమేశ్వర్ వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల నిలిపివేతకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 11 టీఎంసిలు నీళ్లను తోడుకెళ్లితే.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నాగర్జున్‌సాగర్, డిండి, నల్లగొండ, ఖమ్మం ప్రాజెక్టులు ఏడారిగా మారి సాగు భూములు బీడు భూములుగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. అదే విధంగా హైదరాబాద్‌కు మంచి నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నానని సూచించారు.